Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెత్త హెల్మెట్లతో మైదానంలో అయినా.. మైదానం వెలుపల అయినా వికెట్ పడుతుంది...

angelo mathews
, గురువారం, 9 నవంబరు 2023 (09:23 IST)
ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారుల్లో అవగాహన కల్పించేందుకు వివిధ రాష్ట్రాల ట్రాఫిక్ పోలీసులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తుంటారు. కొందరు పోలీసులు సమాజంలో మనం కళ్ళెదుట జరిగే కొన్ని విచిత్ర సంఘటనల ఆధారంగా చేసుకుని వినూత్నంగా ఆలోచన చేస్తూ ప్రచారం చేస్తుంటారు. ఇందుకోసం సోషల్ మీడియాలోను విస్తృతంగా వాడుకుంటున్నారు. 
 
తెలంగాణాలో జరిగిన ప్రమాదాలకు సంబంధించిన వీడియోలను ట్రాఫిక్ పోలీసులు యూట్యూబ్ చానెల్‌లో షేర్ చస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. అయితే, హెల్మెట్ల నాణ్యతపై అవగాహన కల్పించేందుకు ఒడిశా రవాణా శాఖ వినూత్న పంథాను ఎంచుకుంది. 
 
ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌ మ్యాచ్‌లలో భాగంగా ఇటీవల శ్రీలంక - బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో జరిగిన ఓ సంఘటనను ఉదహరిస్తూ ప్రచారం మొదలుపెట్టింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ "టైమ్డ్ ఔట్" అయిన ఉదంతాన్ని నెట్టింట ప్రస్తావిస్తూ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. 
 
చెత్త క్వాలిటీ హెల్మెట్లతో మైదానంలో అయినా.. మైదానం వెలుపలు అయినా వికెట్ పడిపోతుందని హెచ్చరించింది. హెల్మట్ల నాణ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఒడిశా రవాణా శాఖ అధికారులు చేసిన ప్రయత్నం నెటిజన్లకు అమితంగా నచ్చడంతో వారు ఈ పోస్టును నెట్టింట వైరల్ చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విద్యార్థికి 14 యేళ్ళు.. టీచరమ్మకు 22 యేళ్లు.. స్కూల్‌లో శృంగారం.. ఎక్కడ?