Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాలుగు కిలోల టమోటా కోసం పిల్లల్ని తాకట్టు పెట్టాడు.. ఎక్కడ?

Tomato
, మంగళవారం, 1 ఆగస్టు 2023 (16:49 IST)
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో టమాటా ధరలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. కిలో టమాటా రూ. 200 పలుకుతుండటంతో సామాన్యులు కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. తాజాగా ఓ వ్యక్తి టమోటాలు కొనుగోలు చేయడం కోసం ఇద్దరు పిల్లలను కుదువ పెట్టాడు. 
 
కూరగాయల దుకాణంలోకి వెళ్లిన ఓ వ్యక్తి నాలుగు కిలోలు టమోటాలను కొనుగోలు చేశాడు. అనంతరం డబ్బులు ఇస్తానన్నాడు. బంధువుల నుంచి అడిగి తెస్తానని చెప్పాడు. అప్పటివరకు ఇద్దరు పిల్లలను ఇక్కడే వుంటారని చెప్పి వెళ్లిపోయాడు. ఎంతకీ ఆ వ్యక్తి రాకపోవడంతో అనుమానం వచ్చిన కూరగాయల దుకాణం యజమాని పిల్లల్ని ప్రశ్నించడంతో అసలు విషయం బయటికి వచ్చింది. 
 
ఒడిశాలోని కటక్‌ నగరంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తాను వాషింగ్ మెషీన్ కొనుగోలు చేశానని.. దాన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు కూలీలు కావాలని ఇద్దరు పిల్లలను తీసుకెళ్లినట్లు తేలింది. రోజుకు కూలీ ఇస్తానని చెప్పి.. టమోటా అంగట్లో వదిలి వెళ్లినట్లు తేలింది. 
 
అయితే ఆ పిల్లలు.. ఆ వ్యక్తి బిడ్డలే అని నమ్మిన ఆ కూరగాయల దుకాణం ఓనర్ ఏమీ అనలేదు. డబ్బులు తీసుకువస్తా అని 4 కిలోల టమాటాలు తీసుకువెళ్లిన వ్యక్తి ఎంత సేపటికీ రాలేదు. దీంతో అసలు సంగతి బయటపడింది. 
 
ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు.. ఆ వ్యక్తిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెరుగుతున్న డెంగీ కేసులు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు