Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పన్నీర్ సెల్వం సెన్సేషనల్ కామెంట్స్: మనస్సాక్షికి అనుగుణంగా..

తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం సంచలన కామెంట్స్ చేశారు. ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో రెండు వర్గాలుగా అన్నాడీఎంకే పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ వర్గం శశికళ వర్గానికి చెందినవారైతే.. మరోవైపు ఓపీఎస్ వర్గ

Advertiesment
పన్నీర్ సెల్వం సెన్సేషనల్ కామెంట్స్: మనస్సాక్షికి అనుగుణంగా..
, బుధవారం, 5 ఏప్రియల్ 2017 (16:31 IST)
తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం సంచలన కామెంట్స్ చేశారు. ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో రెండు వర్గాలుగా అన్నాడీఎంకే పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ వర్గం శశికళ వర్గానికి చెందినవారైతే.. మరోవైపు ఓపీఎస్ వర్గం నువ్వానేనా అన్నట్లు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
 
అయితే ఈ ఎన్నికల ఫలితాలు తప్పకుండా అన్నాడీఎంకే ఏర్పడిన చీలికను మళ్లీ కలుపుతాయని.. కొద్ది రోజుల క్రితం అన్నాడీఎంకే డిప్యూటీ కార్యదర్శి దినకరన్ అన్నారు. తాజాగా ఓపీఎస్ కూడా ఆర్కేనగర్ ఉప ఎన్నికల తర్వాత అన్నాడీఎంకేలోని వర్గాలన్నీ ఏకం అవుతాయని.. రెండు వర్గాలు ఒక్కటైపోతాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం తాత్కాలికమేనని, త్వరలో రెండు వర్గాలు ఒక్కటవుతాయని ఓపీఎస్ స్పష్టం చేశారు. 
 
ప్రస్తుతం శశికళ వర్గంలోవున్న 122 మంది ఎమ్మెల్యేలు ఉప ఎన్నిక ఫలితం తర్వాత తమ మనస్సాక్షికి అనుగుణంగా మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్లు ఓపీఎస్ తెలిపారు. అయితే ఓపీఎస్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమైనాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్మోహన్ రెడ్డి రాకతోనే శ్రీరామరాజ్యం : వైసీపీ ఎమ్మెల్యే రోజా జోస్యం