Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్మోహన్ రెడ్డి రాకతోనే శ్రీరామరాజ్యం : వైసీపీ ఎమ్మెల్యే రోజా జోస్యం

శ్రీరామనవమిని పురస్కరించకుని ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేలాదిమంది భక్తులు సీతారాముల దర్శనం కోసం బారులు తీరారు. ఒంటిమిట్ట ఆనవాయితీ ప్రకారం నిండు పున్నమి వెలుగుల్లో పదో తేదీ రాత

Advertiesment
జగన్మోహన్ రెడ్డి రాకతోనే శ్రీరామరాజ్యం : వైసీపీ ఎమ్మెల్యే రోజా జోస్యం
, బుధవారం, 5 ఏప్రియల్ 2017 (15:53 IST)
శ్రీరామనవమిని పురస్కరించకుని ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేలాదిమంది భక్తులు సీతారాముల దర్శనం కోసం బారులు తీరారు. ఒంటిమిట్ట ఆనవాయితీ ప్రకారం నిండు పున్నమి వెలుగుల్లో పదో తేదీ రాత్రిపూట శ్రీరామ కళ్యాణం వైభవంగా జరగుతుంది.
 
కాగా వైకాపా నేత, నగరి ఎమ్మెల్యే రోజా శ్రీరామనవమి సందర్భంగా ఒంటిమిట్ట రాముల వారి కళ్యాణానికి హాజరయ్యారు. రాముల వారిని దర్శించుకున్న అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డిని శ్రీరామునితో పోల్చారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో శ్రీరాముడి పాలన ప్రారంభమవుతుందని ఆకాంక్షించారు.
 
సుపరిపాలన సాగించిన శ్రీరాముడి తర్వాత మళ్లీ అలాంటి పాలన వైఎస్సార్ హయాంలోనే జరిగిందని రోజా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి రాకతోనే రామరాజ్యం వస్తుందని.. రోజా తెలిపారు. త్వరలోనే ఆ కల సాకారమవుతుందని తెలిపారు. 
 
ఏపీ భద్రాద్రి ఒంటిమిట్టను ఏపీ సీఎం చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఒంటిమిట్టలో సౌకర్యాలు భక్తులకు అనువుగా లేవన్నారు. భక్తులకు కనీసం మంచినీటిని కూడా అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#BSNL bumper offer: నెలకు రూ.249... రోజుకు 10జీబీ డేటా