Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సరదాగా రేప్ చేయాలనుందా నాయనా.. అయితే అక్కడికెళ్లండి.. తాట తీస్తారు

ఆడదాన్ని చూస్తే చాలు కామ నరం ప్రకోపించి సరదాగానో, సీరియస్‌గానో, కసిగానో అత్యాచారాలకు పాల్పడుతున్న రోగ్స్‌కి ఇక కాలం చెల్లినట్లే. ఇలాంటి భ్రష్టులకు మా రాష్ట్రంలో ఉరే గతి అంటోంది మధ్య ప్రదేశ్.

సరదాగా రేప్ చేయాలనుందా నాయనా.. అయితే అక్కడికెళ్లండి.. తాట తీస్తారు
హైదరాబాద్ , శనివారం, 1 ఏప్రియల్ 2017 (08:37 IST)
ఆడదాని ఒంటిమీద చేయి వేయాలంటే భయపడే రోజు రావాలి అంటూ మలయాళీ హీరోయిన్ భావనపై వేధింపులపై సినీనటి స్నేహ వ్యాఖ్యనించి ఎక్కువ రోజులు కాలేదు. ఇప్పుడామె కోరిక దేశంలో ఒకచోట మాత్రం పూర్తిగా సాకారమయ్యే వీలు కలుగుతోంది. ఆడదాన్ని చూస్తే చాలు కామ నరం ప్రకోపించి సరదాగానో, సీరియస్‌గానో, కసిగానో అత్యాచారాలకు పాల్పడుతున్న రోగ్స్‌కి ఇక కాలం చెల్లినట్లే. ఇలాంటి భ్రష్టులకు మా రాష్ట్రంలో ఉరే గతి అంటోంది మధ్య ప్రదేశ్ రాష్ట్రం
 
బీజేపీ పాలిత ప్రాంత రాష్టాలు శిక్షల విషయంలో సకల పరిమితులనూ తోసి రాజంటున్నాయి. మొన్న ఉత్తరప్రదేశ్‌లో యాంటీ రోమియో చట్టం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ఆ రాష్ట్రంలోని రోడ్ సైడ్ రోమియోలను భరతం పట్టే చర్యలను సీరియస్‌గా అమలు చేస్తున్నారు. ఇప్పుడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తనవంతుగా లైంగిక వేధింపుల, అత్యాచారాల రాబందుల పని పట్టడానికి సరికొత్త యాంటీ రోమియో తరహా కొరడా ఝళిపించారు.
 
వినగానే రోమియోలకు ఉచ్చపడే తరహా ప్రకటన చేశారు ఎంపీ సీఎం. రేపిస్టులను ఉరితీసే చట్టం తన ప్రభుత్వం తీసుకొస్తుందని ప్రకటించారు. గత  కొంత కాలంగా రేపిస్టులకు మరణదండనే శిక్ష అని ప్రబోధిస్తున్న శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నంత పని చేయడానికి చట్టం తీసుకురానున్నారు. మద్యపానానికి వ్యతిరేకంగా, నర్మదా నది పొడవునా లిక్కర్ షాపుల మూసివేతకు అనుకూలంగా తరచూ ప్రకటనలు చేస్తున్న ఎంపీ ముఖ్యమంత్రి తాజాగా రేపిస్టులపై మరణ దండన కొరడా ఝళిపించడంతో రాష్ట్రంలోని యావన్మంది మహిళలపై మంచి ప్రభావం వేసి 2018లో రాష్ట్రంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు తీసుకువస్తుందని భావిస్తున్నారు.
 
2015సో 4.391 రేప్ కేసులతో దేశంలోనే అత్యాచారాల రాజదానిగా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెడ్డపేరు ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం శివరాజ్ ప్రకటన చేస్తూ వర్షాకాల సీజన్లోనే  రేపిస్టులకు మరణదండన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతామన్నారు. ఇప్పటికే మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉండి రికార్డు సృష్టించిన శివరాజ్ సింగ చౌహాన్ నాలుగో సారి కూడా గెలుపు సాధించడానికి ఈ రేపిస్టులకు మరణదండన బిల్లు బ్రహ్మాండంగా సహకరిస్తుందని భావిస్తున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇక పన్ను ఎగవేతల నుంచి ఎవరూ తప్పించుకోలేరు.. ప్రతి పైసా కౌంటే ఇక్కడ.