Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇక పన్ను ఎగవేతల నుంచి ఎవరూ తప్పించుకోలేరు.. ప్రతి పైసా కౌంటే ఇక్కడ.

ప్రార్థన.. ప్రతి పైసా కౌంటే ఇక్కడ అంటూ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ చెప్పిన డైలాగ్‌ను ఆదాయ పన్ను శాఖ ఇప్పుడు ఆదర్శంగా తీసుకుంటున్నట్లుంది. ఆదాయానికి మించి డిపాజిట్లు చేసినవారి గుట్టుమట్లు తెలుసుకోవడానికి, పన్ను ఎగవేతలను అరికట్

ఇక పన్ను ఎగవేతల నుంచి ఎవరూ తప్పించుకోలేరు.. ప్రతి పైసా కౌంటే ఇక్కడ.
హైదరాబాద్ , శనివారం, 1 ఏప్రియల్ 2017 (08:04 IST)
ప్రార్థన.. ప్రతి పైసా కౌంటే ఇక్కడ అంటూ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ చెప్పిన డైలాగ్‌ను ఆదాయ పన్ను శాఖ ఇప్పుడు ఆదర్శంగా తీసుకుంటున్నట్లుంది. ఆదాయానికి మించి డిపాజిట్లు చేసినవారి గుట్టుమట్లు తెలుసుకోవడానికి, పన్ను ఎగవేతలను అరికట్టడానికి సహజ్ అనే పేరుతో కొత్త టాక్స్ రిటర్న్ పత్రాన్ని ఆదాయ శాఖ ఆవిష్కరించింది. ఏప్రిల్ 1 నుంచి మొదలవుతున్న ఈ కొత్త ఫారం వార్షికాదాయం 50 లక్షల రూపాయల వరకు ఉంటున్న వ్యక్తుల ఆదాయాలను సమర్థవంతంగా అంచనా వేయడానికి వీలవుతుంది.
 
కేవలం ఒక పేజీ మాత్రమే ఉండి అత్యంత సరళ రూపంలో ఉన్న ఈ కొత్త పత్రంలో గత ఏడాది నవంబర్ 9 నుంచి డిసెంబర్ 30 వరకు పెద్ద నేట్లరద్దు అమల్లోకి వచ్చిన కాలంలో 2 లక్షల రూపాయలకు మించి బ్యాంకుల్లో నగదు డిపాజిట్ చేసిన వారు ఆ వివరాలను దీంట్లో తప్పకుండా పొందపర్చవలసి ఉంటుంది. 
 
ఈ కొత్త పత్రంలో పన్ను చెల్లింపు దారులు తమ 12 డిజిట్ ఆధార్ సంఖ్యను, పాన్ నంబర్‌ని పొందపర్చవలసి ఉంటుంది. ఆదార్ కార్డు నంబర్ లేకపోతే 28 డిజిట్‌తో కూడిన ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సంఖ్యను పొందుపర్చవలసి ఉంటుంది. ఈ పత్రం 2017-18 అసెస్‌మెంట్ సంవత్సరానికి వర్తింపు అవుతుంది. 
 
ఐటీ రిటర్న్ పత్రాలను వీలైనంత సరళంగా ఉంచడానికి కేంద్రంలో చాలా కాలంగా అనేక ప్రభుత్వాలు ప్రయత్నించాయి. కానీ ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే ఈవిషయంలో సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్నట్లు కనబడుతోంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా వెనక ఎవరు ఉన్నా ఎన్టీఆర్‌కు వెన్నుపోటే గుర్తుకొస్తుందంటున్న వెంకయ్య నాయుడు