Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెద్ద నోట్ల రద్దు యూపీ వాసులకు నచ్చింది.. అందుకే కుమ్మేశారు : బీహార్ సీఎం నితీశ్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వాసులకు బాగా నచ్చిందని, అందుకే బీజేపీకి ఓట్లు కుమ్మేశారంటూ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

పెద్ద నోట్ల రద్దు యూపీ వాసులకు నచ్చింది.. అందుకే కుమ్మేశారు : బీహార్ సీఎం నితీశ్
, ఆదివారం, 12 మార్చి 2017 (16:00 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వాసులకు బాగా నచ్చిందని, అందుకే బీజేపీకి ఓట్లు కుమ్మేశారంటూ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అభిప్రాయపడ్డారు. 
 
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బంపర్ మెజార్టీతో విజయం సాధించిన విషయం తెల్సిందే. దీనిపై నితీశ్ స్పందించారు. పెద్ద నోట్ల రద్దుపై ప్రతిపక్షాలు అంత తీవ్రంగా రభస చేయకుండా ఉండవలసిందన్నారు. ధనవంతులను బాధించిన కార్యక్రమంగా రూ.500, రూ.1,000 నోట్ల రద్దు నిర్ణయాన్ని పేదలు భావిస్తున్నారన్నారు.
 
ఈ ఫలితాల తర్వాత బీజేపీయేతర పార్టీలు ఆ వర్గాలను ఏకీకృతం చేసే ప్రయత్నం చేయలేదన్నారు. ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల్లో గెలిచినవారందరికీ ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. బీహార్ తరహాలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తర ప్రదేశ్‌లో మహాకూటమిని ఏర్పాటు చేసుకోలేకపోవడం కూడా ఆ పార్టీల ఓటమికి కారణమని ఆయన చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీలో నా మాట ఎవరు వింటారు... సుష్మా తనతో ఫోన్‌లో కూడా మాట్లాడరు.. ప్రధాని మోడీ