Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీలో నా మాట ఎవరు వింటారు... సుష్మా తనతో ఫోన్‌లో కూడా మాట్లాడరు.. ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయను బీజేపీ అగ్రనేతలు చిన్నచూపు చూసేవారు. ముఖ్యంగా.. అగ్రనేతలైన మురళీ మనోహర్ జోషీ, సుష్మా స్వరాజ్ వంటి వారు మోడీని కరివేపాకులా తీసిపారేశారు.

Advertiesment
ఢిల్లీలో నా మాట ఎవరు వింటారు... సుష్మా తనతో ఫోన్‌లో కూడా మాట్లాడరు.. ప్రధాని మోడీ
, ఆదివారం, 12 మార్చి 2017 (15:49 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయను బీజేపీ అగ్రనేతలు చిన్నచూపు చూసేవారు. ముఖ్యంగా.. అగ్రనేతలైన మురళీ మనోహర్ జోషీ, సుష్మా స్వరాజ్ వంటి వారు మోడీని కరివేపాకులా తీసిపారేశారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ముఖ్యనేత వద్ద మోడీ చేసిన వ్యాఖ్యలు ఇపుడు వెలుగులోకి వచ్చాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ సర్కారు నిర్ణయించింది. దీంతో మోడీని కలిసిన ఆ నేత లోక్‌సభలో తెలంగాణ బిల్లును అడ్డుకోవాలంటూ సుష్మాస్వరాజ్‌కు, రాజ్యసభలో అరుణ్‌జైట్లీకి చెప్పాలని కోరారట. దీనికి స్పందించిన మోడీ.. తాను గుజరాత్ వాడినని, తన మాట ఢిల్లీలో వినేవారు ఎవరూ లేరు. అంతేకాదు, తనను ఢిల్లీకి రాకుండా చేయాలని కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారు. సుష్మా స్వరాజ్ అయితే తనతో ఫోన్‌లో కూడా మాట్లాడరు. ఏమైనా మాట్లాడేది ఉంటే ఢిల్లీ రమ్మంటారు. తనకు అంత అవసరమా? అని సదరు నేతతో చెప్పారట. 
 
కానీ దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అయ్యారు. ఆయన సీనియర్లకు ప్రాధాన్యత ఇచ్చినట్టు ఇస్తూనే వారి ప్రాభవాన్ని పూర్తిగా లేకుండా చేశారు. దీనికి మంచి ఉదాహరణే... సుష్మా స్వరాజ్. ఈమెకు విదేశాంగశాఖను కట్టబెట్టారు. కానీ ఆమెకు ప్రాధాన్యం ఇవ్వలేదు. అలాగే, ప్రస్తుతం మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గం నిజానికి సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీది. అక్కడి నుంచి మోడీ బరిలోకి దిగుతానన్నప్పుడు జోషి తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో మోడీ ప్రధాని అయ్యాక ఆయనను పూర్తిగా దూరంపెట్టేశారు. ఇపుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలతో మిగిలిన సీనియర్ నేతలు కూడా చెప్పాపెట్టకుంటా తట్టాబుట్టా సర్దుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్లోరిడాలో భారతీయుడి స్టోర్‌కు నిప్పు.. మరోమారు పడగవిప్పిన జాత్యహంకారం