నితీశ్ కటారా హత్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు.. ముద్దాయిలకు 25 యేళ్ల జైలుశిక్ష ఖరారు
దేశంలో సంచలనం సృష్టించిన బిజినెస్ ఎగ్జిక్యూటివ్ నితీశ్ కటారా హత్య కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పును సోమవారం వెల్లడించింది. నిందితులు వికాస్ యాదవ్, విశాల్ యాదవ్‌లకు 25 ఏళ్ల జైలుశిక్ష, వీరికి సహకరించిన
దేశంలో సంచలనం సృష్టించిన బిజినెస్ ఎగ్జిక్యూటివ్ నితీశ్ కటారా హత్య కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పును సోమవారం వెల్లడించింది. నిందితులు వికాస్ యాదవ్, విశాల్ యాదవ్‌లకు 25 ఏళ్ల జైలుశిక్ష, వీరికి సహకరించిన సుఖ్ దేవ్ పహిల్వాన్‌కు 20 ఏళ్ల జైలుశిక్షను ఖరారు చేసింది.
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... నితీశ్, యూపీకి చెందిన డీపీ యాదవ్ కుమార్తె భారతీ యాదవ్ ప్రేమించుకోగా, వీరి ప్రేమను యాదవ్ కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. తన సోదరితో నితీశ్ ప్రేమ వ్యవహారాన్ని జీర్ణించుకోలేకపోయిన వికాస్, విశాల్‌లు, తమ మిత్రుడు సుఖ్ దేవ్ సహకారంతో, 2002, ఫిబ్రవరి 16న ఓ వివాహానికి హాజరైన నితీశ్‌ను కిడ్నాప్ చేసి, సుత్తితో విచక్షణారహితంగా కొట్టి, డీజిల్ పోసి నిప్పంటించారు.
మూడు రోజుల తర్వాత నితీశ్ మృతదేహాన్ని జాతీయ రహదారిపై గుర్తించారు. అప్పటికే తన కుమారుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేసిన నితీశ్ తల్లి, నీలమ్ రక్త నమూనాలు తీసుకుని డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించగా, మృతుడు నితీశ్ అని తేలింది. ఆపై కేసును విచారించిన హైకోర్టు నిందితులకు దీర్ఘకాలపై జైలుశిక్షలు విధిస్తూ, తీర్పివ్వగా, శిక్ష తగ్గించాలని వారు సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు అదే శిక్షలను ఖరారు చేశారు.