Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మకేమైంది.. హుటాహుటిన అపోలో ఆస్పత్రికి మంత్రి పన్నీర్ సెల్వం

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఏదో అయినట్టుగా కనిపిస్తుంది. ఆమె గత నెల 22వ తేదీ నుంచి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నా, ఆమె గురించిన

Advertiesment
అమ్మకేమైంది.. హుటాహుటిన అపోలో ఆస్పత్రికి మంత్రి పన్నీర్ సెల్వం
, సోమవారం, 3 అక్టోబరు 2016 (11:12 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఏదో అయినట్టుగా కనిపిస్తుంది. ఆమె గత నెల 22వ తేదీ నుంచి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నా, ఆమె గురించిన సరైన సమాచారం చెప్పడం లేదని అభిమానులు ఆందోళనకు దిగుతున్న వేళ, మాజీ ముఖ్యమంత్రి పనీర్ సెల్వం సోమవారం ఉదయం ఆసుపత్రికి వచ్చారు. 
 
జయలలిత ఆసుపత్రిలో ఉన్న వేళ, పాలనా బాధ్యతలను పరోక్షంగా చేపట్టిన ఆయన, మరో ఇద్దరు మంత్రులతో కలసి హడావుడిగా లోపలికి వెళ్లారు. ఆసుపత్రిలో జయలలిత నిచ్చెలి శశికళతో పనీర్ సెల్వం ప్రత్యేకంగా సమావేశమైనట్టు సమాచారం. 
 
మరోవైపు.. జయలలిత చికిత్స పొందుతున్న వార్డులోకి శశికళ మినహా మరెవరినీ అనుమతించడం లేదు. లండన్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్యుడు రిచర్డ్ నేతృత్వంలో ఆమెకు చికిత్స కొనసాగుతోంది. మరికాసేపట్లో పనీర్ సెల్వం మీడియాతో మాట్లాడతారని ఏఐఏడీఎంకే వర్గాలు వెల్లడించాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్పత్రిలో అమ్మ.. శశికళ ఆపద్ధర్మ సీఎం అవుతారా? పన్నీర్ సెల్వంకు ఆ ఛాన్స్ లేదా?