Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆస్పత్రిలో అమ్మ.. శశికళ ఆపద్ధర్మ సీఎం అవుతారా? పన్నీర్ సెల్వంకు ఆ ఛాన్స్ లేదా?

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత చికిత్సకు స్పందిస్తున్నారని, ఆమెకు మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే చికిత్స అందించాలని అపోలో ఆసుపత్రి వర్గాలు వెల్లడించిన నేపథ్యంలో.. ఆమె మాజీ స్నేహితుర

Advertiesment
Tamil Nadu CM Jayalalithaa in hospital
, సోమవారం, 3 అక్టోబరు 2016 (10:57 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత చికిత్సకు స్పందిస్తున్నారని, ఆమెకు మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే చికిత్స అందించాలని అపోలో ఆసుపత్రి వర్గాలు వెల్లడించిన నేపథ్యంలో.. ఆమె మాజీ స్నేహితురాలు శశికళ అప్రమత్తమైనట్లు కనిపిస్తోంది. అత్యవసరంగా ఏఐ డీఎంకె ఎమ్మెల్యేలంతా చెన్నైకి రావాలంటూ ఆమె ఓ ప్రకటన విడుదల జారీ చేశారు. సోమవారం వీరంతా నగరానికి రావాలని ఆమె ఆ ప్రకటనలో కోరారు. 
 
పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో రానున్నట్టు తెలుస్తోంది. అమ్మ మరికొన్ని రోజులు ఆస్పత్రిలోనే విశ్రాంతి తీసుకోవలసిన అవసరం ఉందని డాక్టర్లు చెప్పడంతో రాష్ట్ర పాలనా వ్యవహారాలు ఎవరు చూస్తారన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. 
 
దీనిపై మాజీ సిఎం, ప్రస్తుత ఆర్ధిక శాఖామంత్రి పన్నీర్ సెల్వం మాత్రం పెదవి విప్పడంలేదు. గతంలో రెండుసార్లు సీఎంగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ఈ క్రమంలో శశికళ కాబోయే ఆపద్ధర్మ సీఎం కావచ్చునంటూ ఇంకోవైపు పొలిటికల్ సర్కిల్స్‌లో వార్తలు జోరందుకున్నాయి. పన్నీర్ సెల్వంకు సీఎం పదవి అప్పగించేందుకు జయమ్మ సానుకూలంగా లేరని.. అందుకే శశికళను సీఎం చేయాలని అమ్మ చెప్పేసినట్లు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీపై సోదరుడి మీనాజుద్దీన్ భార్య ఫిర్యాదు... అసహజ సెక్స్‌ చేయమంటున్నాడు..