Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నీతా అంబానీ 60వ పుట్టినరోజు సందర్భంగా 1.4 లక్షల మందికి 'అన్న సేవ'

nita ambani
, గురువారం, 2 నవంబరు 2023 (17:19 IST)
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు మరియు చైర్‌పర్సన్ నీతా అంబానీ నవంబరు ఒకటో తేదీన 60వ పుట్టినరోజును జరుపుకున్నారు. ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో 3000 మంది పిల్లల మధ్య నీతా అంబానీ ఈ వేడుకను  జరుపుకున్నారు. 
 
ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలకు చెందిన 1.4 లక్షల మందికి అన్నసేవ ద్వారా అన్నదానం చేశారు. అన్న సేవ ద్వారా దాదాపు 75 వేల మందికి వండిన ఆహారాన్ని అందించగా, సుమారు 65 వేల మందికి ముడి రేషన్‌ను పంపిణీ చేశారు. 
 
ప్రధానంగా పిల్లలకు, వృద్ధాశ్రమాల్లో నివసించే వృద్ధులకు, రోజువారీ వేతన జీవులకు, కుష్టు వ్యాధిగ్రస్తులకు మరియు ప్రత్యేక అవసరాలు ఉన్నవారికి ఆహారం అందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ, విజయవాడ పట్టణాలలో రిలయన్స్ ఫౌండేషన్ అన్నసేవ కార్యక్రమాన్ని చేపట్టింది. సుమారు 600 మందికి కిట్‌లను అందించారు.
webdunia
 
కరోనా మహమ్మారి సమయంలో కూడా అన్న సేవ పేరుతో రిలయన్స్ ఫౌండేషన్ అతిపెద్ద ఆహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. విద్య, మహిళా సాధికారత, క్రీడలు, కళ, రంగాలలో నీతా అంబానీ లెక్కలేనన్ని విజయాలు సాధించారు. తన నాయకత్వంలో, రిలయన్స్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా 71 మిలియన్లకు పైగా ప్రజల జీవితాలను ప్రభావితం చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎస్బీఐలో ఉద్యోగాలు... నెల వేతనం రూ.45 వేలు