Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అర్థరాత్రి తలుపుతట్టిన నిర్భయ దోషులు ... ఛీకొట్టిన సుప్రీం కోర్టు

అర్థరాత్రి తలుపుతట్టిన నిర్భయ దోషులు ... ఛీకొట్టిన సుప్రీం కోర్టు
, శుక్రవారం, 20 మార్చి 2020 (07:08 IST)
నిర్భయ అత్యాచార కేసులో దోషులుగా తేలి నలుగురు నిందితిలు చివరి నిమిషం వరకు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. రోజూ ఏదో ఒక సాకుతో కింది నుంచి పైస్థాయి వరకు అన్ని కోర్టులను ఆశ్రయిస్తూ శిక్ష అమలును వాయిదా వేయించుకునేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. 
 
ఈ కేసులో దోషులుగా తేలిన ముఖేశ్ సింగ్, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మలు.. చట్టపరంగా తమకు ఉన్న అన్ని హక్కులు ఉపయోగించుకున్నారు. చివరికు గురువారం వెల్లడించిన ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. శుక్రవారం సాయంత్రం ఈ కోర్టులో వారికి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఉరిశిక్షను అమలు చేయాలన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో శుక్రవారం రాత్రి అప్పీలు చేశారు. 
 
ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ బోప్పన్నలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం అర్థరాత్రి అత్యవసరంగా విచారించింది. దోషులు పెట్టుకున్న పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు.. హైకోర్టు తీర్పును సమర్థించింది. దీంతో శిక్ష అమలుకు చివరి అవకాశం కూడా తొలగిపోయింది. 
 
అయితే, దోషులను ఉరితీసే ముందు వారిని కలిసేందుకు కుటుంబ సభ్యులకు ఐదు, పదినిమిషాల సమయం ఇవ్వాలని వారి తరపు న్యాయవాది ఏపీ సింగ్ కోరారు. ఇందుకు జైలు నియమాలు అనుమతించవని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తేల్చిచెప్పారు. ఫలితంగా దోషులు చివరిసారిగా తమ కుటుంబ సభ్యులను కూడా చూసుకునే అవకాశం లేకుండా పోయింది. 
 
ఆ తర్వాత శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ఈ నలుగురు ముద్దాయిలను ఉరికంభానికి తలారి పవన్ జల్లాద్ వేలాడదీశారు. అర్థగంట తర్వాత ఈ ముద్దాయిల మృతదేహాలను పరిశీలించిన వైద్యులు.. వారంతా చనిపోయినట్టు నిర్ధారించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిర్భయ కేసు : ఏడేళ్ళ నిరీక్షణకు తెరపడింది.. ముద్దాయిలకు ఉరి