Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేరళలో ప్రబలుతున్న నిఫా వైరస్.. కంటైన్మెంట్ జోన్లుగా ఏడు గ్రామాలు

nipah virus
, గురువారం, 14 సెప్టెంబరు 2023 (15:13 IST)
కేరళ రాష్ట్రాన్ని నిఫా వైరస్ భయపెడుతుంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, బాధిత కుటుంబ సభ్యుల్లో ఇద్దరికి పాజిటివ్ రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. బాధితుల సొంతూళ్లతో పాటు చుట్టుపక్కల ఏడు గ్రామాలను కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించింది. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని ఆయా గ్రామాల ప్రజలకు సూచించింది. గ్రామాల్లో ఆంక్షలు విధించింది. బడులు, ప్రభుత్వ కార్యాలయాలను అధికారులు మూసివేయించారు.
 
ఇదిలావుంటే, కోళికోడ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చెందిన ఉద్యోగికి వైరస్ సోకినట్లు పరీక్షల్లో తేలింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ నిర్ధారించారు. రాష్ట్రంలో బుధవారం వరకు మొత్తం ఐదు కేసులు గుర్తించినట్లు వివరించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని, వైరస్ బాధితులను కాంటాక్ట్ లిస్టులో ఉన్న 706 మందిని గుర్తించామని చెప్పారు. 
 
వీకిలో హైరిస్క్ కేటగిరీలో ఉన్న 77 మందిని వారి వారి ఇళ్లల్లోనే ఐసోలేషన్ లో ఉంచి పరీక్షిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 19 కమిటీలను ఏర్పాటు చేసి ఈ చర్యలను సమన్వయం చేసుకుంటున్నామని, ఐసోలేషన్‌లో ఉన్న వారికి నిత్యావసరాలు అందించేందుకు వాలంటీర్ల బృందాలను కూడా ఏర్పాటు చేశామని మంత్రి వీణా జార్జ్ వివరించారు.
 
కాగా, నిఫా వైరస్ గబ్బిలాలు, పందుల ద్వారా మనుషులకు సోకుతుందని మంత్రి వీణా జార్జ్ తెలిపారు. వ్యాప్తి తక్కువగానే ఉన్నప్పటికీ మరణాల సంఖ్య ఎక్కువని చెబుతూనే ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ప్రజలకు ధైర్యం చెప్పారు. అయితే, జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిస్టర్ జగన్.. యుద్ధమే కోరుకుంటే... మేం సిద్ధం : పవన్ కళ్యాణ్