Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

Advertiesment
Pregnant

సెల్వి

, శుక్రవారం, 16 మే 2025 (20:22 IST)
తమిళనాడు, తిరువణ్ణామలై జిల్లాలో నాలుగు నెలల గర్భిణి దివ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య మరణించిన శోకంలో భర్త ప్రతాప్ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. తిరువణ్ణామలై జిల్లా వనవాసిని ఆడుళ్ల విళంగాడు గ్రామాన్ని చెందిన వేలు అనే వ్యక్తి కుమార్తె దివ్య (19). ఇతనికి, వందవాసి, విలంగాడు గ్రామానికి చేరిన చెల్లప్పన్ కుమారుడు ప్రతాప్ (25) గత ఫిబ్రవరి నెలలో వివాహం చేసుకున్నారు. 
 
ప్రతాప్ చెన్నై ప్రైవేట్ లారీ కంపెనీ మేనేజర్‌గా పనిచేస్తూ వచ్చాడు. ఇక ప్రతాప్ భార్య దివ్య 4 నెలల గర్భవతి. అయితే గత 10 రోజుల క్రితం దివ్య తల్లి ఇంటికి వెళ్లింది. కానీ గత రెండు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దివ్య ఒక్కసారిగా ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన దివ్య కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషయం తెలిసి ప్రతాప్ షాక్ నుంచి తేరుకోలేకపోయాడు. 
 
భార్య మరణించిన విషయాన్ని ప్రతాప్ జీర్ణించుకోలేకపోయాడు. భార్య మరణవార్త విని చేతిలో విషంతో బస్సెక్కిన ప్రతాప్ మార్గమధ్యంలోనే విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో 4 నెలల గర్భిణి దివ్య తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతూ వచ్చింది. దీని కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలియవచ్చింది. భార్య లేని శోకంలోనే భర్త కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లికి ఒప్పుకోలేదని తనతో గడిపిన బెడ్రూం వీడియోను నెట్‌లో పెట్టేసాడు, స్నేహితురాలు చూసి షాక్