Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లికి ఒప్పుకోలేదని తనతో గడిపిన బెడ్రూం వీడియోను నెట్‌లో పెట్టేసాడు, స్నేహితురాలు చూసి షాక్

Advertiesment
Lady victim

ఐవీఆర్

, శుక్రవారం, 16 మే 2025 (20:08 IST)
ఈమధ్య కాలంలో సహజీవనం కామన్ అవుతున్నది. చాలా జంటలు పెళ్లి చేసుకునే ముందుగానే పరస్పరం అవగాహన చేసుకున్న తర్వాత వివాహం చేసుకుందామని నిర్ణయించుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇద్దరూ కలిసి ఆరు నెలలో ఏడాది కాలమో గడిపేసి అంతా సవ్యంగానే వుందనుకుంటే వివాహం చేసుకుంటున్నారు. ఏ చిన్న తేడా వచ్చినా అప్పటివరకూ కలిసి వున్నవారు ఎవరికివారు విడిపోయి పరిచయమే లేనట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఐతే ఇలాంటి ఘటనల్లో కొన్ని నేరపూరిత సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఇలాంటి ఘటనే పుణెకి చెందిన యువతి విషయంలో జరిగింది.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. పుణేకి చెందిన 24 ఏళ్ల యువతి ఓ కంపెనీలో మేనేజరుగా పని చేస్తోంది. ఈమెకి 27 ఏళ్ల వినయ్ శిరీష్ కులకర్ణి అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దానితో ఇద్దరూ కలిసి గత రెండేళ్లుగా కలిసి తిరిగారు. సన్నిహితంగా కూడా దగ్గరయ్యారు. 2023 దాకా వీరు కలిసే వున్నారు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలంటూ కులకర్ణి ఒత్తిడి చేయడం ప్రారంభించాడు.
 
ఐతే ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో కులకర్ణిని దూరంగా పెట్టేసింది. దీంతో ఆగ్రహానికి గురైన కులకర్ణి తనతో గడిపిన ఏకాంత సమయానికి సంబంధించిన బెడ్రూం వీడియోలను నెట్లో అప్‌లోడ్ చేసాడు. ఆ వీడియో కాస్తా బాధితురాలు స్నేహితురాలి కంటపడింది. విషయాన్ని ఆమె దృష్టికి తీసుకుని వెళ్లడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కులకర్ణిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Grand Tiranga Yatra: విజయవాడలో తిరంగ యాత్ర.. పాల్గొన్న చంద్రబాబు, పవన్