Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నీట్ యూజీ ప్రవేశ పరీక్షల రుద్దు చివరి అస్త్రం : సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

neet exam

వరుణ్

, సోమవారం, 8 జులై 2024 (16:19 IST)
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ అనేది 24 లక్షల మంది విద్యార్థులతో ముడిపడిన అంశమని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అందుకే అన్ని వైపుల నుంచి జాగ్రత్తగా పరిశీలించాకే తుది తీర్పును ఇస్తామని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. గత మే నెల 5వ తేదీన జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీకైన అంశంపై సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై అపెక్స్ కోర్టు విచారణ జరుపుతుంది. 
 
ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకైన మాట వాస్తవమని నిర్ధారించారు. అయితే, లీకైన ప్రశ్నపత్రం ఎంతమందికి చేరింది, తద్వారా ఎంతమంది లబ్ధిపొందారన్నది తేలాల్సివుందన్నారు. 720కి 720 మార్కులు వచ్చిన 67 మంది విద్యార్థులపై సుప్రీంకోర్టు సందేహం వ్యక్తం చేసింది. పరీక్ష రద్దు అనేది 24 లక్షల మంది విద్యార్థుల చివరి అస్త్రమని అపెక్స్ కోర్టు వ్యాఖ్యానించింది. 
 
ప్రశ్నపత్రం లీక్‌తో ఇద్దరు విద్యార్థులకే సంబంధం ఉందని అంటున్నారు.. లీకైన పేపర్ సోషల్ మీడియాలో ఉంచినట్టు తెలుస్తుంది. తద్వారా ఎంతమందికి చేరిందో గుర్తించారా? పేపర్ లీక్‌తో ఎంతమంది ప్రయోజనం పొందారో గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందా? పేపర్ లీక్‌తో ప్రయోజనం పొందిన విద్యార్థులపై ఏం చర్యలు తీసుకున్నారు? ఎంతమంది విద్యార్థుల ఫలితాలను విత్ హెల్డ్స్‌లో ఉంచారు? అని కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో బీజేపీ.. మిత్రపక్షాలను జీవింపనివ్వదు.. సీపీఐ నారాయణ