Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

siddu his wife

ఐవీఆర్

, శుక్రవారం, 22 నవంబరు 2024 (16:38 IST)
కర్టెసి-ట్విట్టర్

నవజ్యోత్ సిద్ధూ భార్య గౌరీ కౌర్ స్టేజ్-IV క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. వైద్యులు జీవించే అవకాశం కేవలం 3% మాత్రమేనని పేర్కొన్నారు. ఐతే ఆమె ఆహారంలో నిమ్మరసం, పచ్చి పసుపు, యాపిల్ సైడర్ వెనిగర్, వేప ఆకులు, తులసిని తీసుకున్నారు. ఈ డైట్ కేవలం 40 రోజుల్లోనే ఆమెకు క్యాన్సర్‌ నుంచి విముక్తిరాల్ని చేసిందంటూ చెపుతున్నారు సిద్ధూ. ఈ విషయాన్ని ఆయన మీడియా ముందు అందరికీ వివరించారు. తను చెప్పే ఈ విషయం చాలామందికి నమ్మశక్యంగా వుండదనీ, కానీ ఇదే నిజం అని వెల్లడించారాయన.

ఐతే సిద్ధు వ్యాఖ్యలపై నెటిజన్లు తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఓ నెటిజన్ పేర్కొంటూ... కేవలం డైట్ వల్లే ఆమెకు 40 రోజుల్లో క్యాన్సర్‌ రహితం అయితే ఈ చికిత్స ఎందుకు? అంటూ ప్రశ్నించారు. మరొకరు స్పందిస్తూ.. సిద్ధూ తన భార్యకు చికిత్స అందిస్తున్న వైద్యులు, ప్రభుత్వ ఆసుపత్రుల చికిత్స ప్రక్రియను ఎక్కడ ప్రశంసించాడో తెలియదు, కానీ ఈ వ్యాధి విషయంలో ఈ ఆయుర్వేద పద్ధతి అర్ధంలేనిది. కొన్ని మూలికలు ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ, అవి క్యాన్సర్‌ను నయం చేయగలవని నిరూపించబడలేదు. క్యాన్సర్ చికిత్సలు కేవలం 40 రోజులు కాకుండా నెలలు లేదా సంవత్సరాలు తరబడి చేయాల్సి వుంటుంది.
 
మరో నెటిజన్ తన అభిప్రాయాన్ని ఇలా రాశారు.. అల్లోపతి చికిత్సతో పాటు, ఆమె ఆహారంలో ఆయుర్వేద పదార్థాలను కూడా చేర్చారు. కేవలం అల్లోపతి చికిత్సతో, ఆమె మనుగడ సాగించలేదు, కానీ ఆయుర్వేదం జోడించడం ద్వారా, ఆమె జీవించి ఉండటమే కాకుండా క్యాన్సర్ నుండి రక్షించబడింది". ఇలా మొత్తమ్మీత సిద్ధూ చెప్పిన మాటలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్