Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆరోగ్యానికి ఆయుర్వేద సూత్రాలు, ఏంటవి?

Advertiesment
ఆరోగ్యానికి ఆయుర్వేద సూత్రాలు, ఏంటవి?

సిహెచ్

, సోమవారం, 12 ఆగస్టు 2024 (19:08 IST)
ఆయుర్వేదం అనేది ఆయుష్షు విజ్ఞానాన్ని తెలిపేది. ఆయుర్వేద వైద్యంలో తెలిపిన కొన్ని ప్రాథమిక అంశాలను మనిషి ప్రతి రోజు పాటిస్తుంటే నిత్యం ఆరోగ్యవంతునిగా జీవితాన్ని గడపవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాము.
 
ప్రాతఃకాలం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎలా సమయాన్ని గడపాలనేది వుంది.
సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలనుకునే వ్యక్తులు ప్రాతఃకాలం ఉదయం 5 గంటలకు నిద్ర లేవాలి.
ఈ సమయంలో నిద్రలేచే వ్యక్తులకు ఆరోగ్యం, విద్య, బలం, తేజస్సు, ధనం సమృద్ధిగా ఉంటాయి.
సూర్యోదయం తర్వాత కూడా నిద్రపోయే వారి ఆయుష్షు క్షీణించడంతో పాటు శరీరంలోని శక్తి నశిస్తుంది.
ఇలాంటి వ్యక్తులు రకరకాల జబ్బులతో బాధపడుతుంటారని ఆయుర్వేద వైద్యం చెబుతోంది.
ప్రాతఃకాలం నిద్రలేచిన తర్వాత మలమూత్రాదులను విసర్జించే ముందు మంచినీటిని సేవించాలి.
రాత్రి పడుకునే ముందు రాగి పాత్రలో నీటిని భద్రపరచుకుని, నిద్ర లేచిన తర్వాత ఆ నీటిని సేవిస్తే ఆరోగ్యం.
నిద్ర లేచిన తర్వాత కనీసం అరలీటరు వీలైతే ఒక లీటరు నీటిని సేవిస్తే మంచిదంటున్నారు వైద్య నిపుణులు.
ఇలా నీటిని సేవిస్తే శరీరంలోనున్న కఫం, వాయు, పిత్త దోషాలు నశించి వ్యక్తి బలశాలి, దీర్ఘాయుష్మంతుడుగా మారుతాడు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పారాథైరాయిడ్ క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స