Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డయాబెటిస్‌కు దివ్యౌషధం కరివేపాకు.. ఎముకలకు బలం

curry leaves

సెల్వి

, గురువారం, 8 ఆగస్టు 2024 (17:02 IST)
కరివేపాకు తరచూ తినడం వల్ల డయాబెటిస్, ఊబకాయం ముప్పు నుంచి బయటపడొచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఇది శరీరంలోని చెడు కొవ్వును నియంత్రించి బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. డయాబెటిస్‌ తగ్గిస్తుందని వైద్యులు చెప్తున్నారు. 
 
అలాగే గ్యాస్ట్రో వంటి తీవ్రమైన సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. కరివేపాలో యాంటీ ఆక్సిడెంట్లు సహా వివిధ రకాల ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. నికోటిన్ ఆమ్లంతో పాటు విటమిన్లు ఏ, బి, ఈ ఉంటాయి. 
 
జీర్ణసమస్యలకు కరివేపాకు దివ్య ఔషధం అనే చెప్పాలి. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ బాగా పని చేస్తుంది. చర్మ సంరక్షణకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. 
 
ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో అనేక రోగాలు మన దరి చేరే అవకాశం ఉండదు. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తాన్ని క్లీన్ చేస్తాయి. ఎముకల అరుగుదలను కూడా ఇది నివారిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సొరకాయ ఎవరికి మంచిది? ఎవరికి చెడ్డది?