తెలంగాణలో ఊబకాయం సమస్య ప్రజలను వేధిస్తుందని తేలింది. ప్రజారోగ్య నిపుణుల అంచనాల ప్రకారం, స్థూలకాయం, మధుమేహం, రక్తపోటు, ప్రీ-డయాబెటిస్ దశలలో స్థిరమైన పెరుగుదల ధోరణి కొనసాగుతుంది. అయితే స్థూలకాయం యువతరం నుంచి వృద్ధులక వరకు వేధిస్తుందని ఆరోగ్య నిపుణుల అంచనా. స్త్రీలలోనూ ఇది అధికంగా వుందని తేలింది.
ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, పొత్తికడుపు కొవ్వు, ప్రీ-డయాబెటిస్ వంటివి...ఆధునిక జీవనశైలి కారణంగా ఉత్పన్నమవుతున్నట్లు ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. తద్వారా తెలంగాణలో మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు క్రమంగా పెరుగుతున్నాయి.
NFHS-5 (జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే)లో అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా, తెలంగాణలోని 15 సంవత్సరాల నుండి 49 సంవత్సరాల వయస్సు గల మహిళల్లో ఉదర ఊబకాయం 35 శాతం నుంచి 50 శాతం మధ్య ఉంది. పురుషులు ఇది దాదాపు 30 శాతానికి చేరువలో ఉంది.