పరిమళించిన మానవత్వం.. మహారాష్ట్ర మంత్రి ఏం చేశారో తెలుసా?
మహారాష్ట్ర రాజధాని ముంబైతో పాటు.. ఆ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు వరద ముంపులో చిక్కుకునిపోయాయి. ఫలితంగా లక్షలాది మంది ముంబై వాసులు ఆశ్రయాన్ని కోల్పోయారు. వరద నీటిలో గృహాలు మునిగిపోవడంతో ఏం చేయాలో, ఎక్కడ
మహారాష్ట్ర రాజధాని ముంబైతో పాటు.. ఆ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు వరద ముంపులో చిక్కుకునిపోయాయి. ఫలితంగా లక్షలాది మంది ముంబై వాసులు ఆశ్రయాన్ని కోల్పోయారు. వరద నీటిలో గృహాలు మునిగిపోవడంతో ఏం చేయాలో, ఎక్కడ ఉండాలో దిక్కుతోచక తల్లడిల్లిపోతున్నారు.
ముఖ్యంగా.. ముంబైలో కురిసిన భారీ వర్షాల కారణంగా రహదారులపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో మహారాష్ట్ర మంత్రి గిరీశ్ బపత్ తన మానవత్వం చాటుకున్నారు. దక్షిణ ముంబైలో తన నివాసానికి పరిసరాల్లో ఉన్న ఫోర్ట్, మంత్రాలయ దగ్గర చిక్కుకుపోయిన ప్రజలను తన ఇంటికి వచ్చి సేద తీరాల్సిందిగా కోరారు.
ఈ మేరకు గిరీశ్ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ప్రజలకు విన్నవించుకున్నారు. కాగా, ముంబైలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రవాణా వ్యవస్థ స్తంభించడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే, పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.