Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆధార్‌-పాన్‌ లంకె పెట్టారా..? లేదంటే రూ.5వేలు అపరాధం?

ఆధార్‌తో పాన్‌కార్డును అనుసంధానించేందుకు గడువు బుధవారం (ఆగస్టు 31)తో ముగియనుంది. ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ అనుసంధానం పూర్తి చేయకుండా ఆగస్టు 5 నాటికే మీరు రిట

ఆధార్‌-పాన్‌ లంకె పెట్టారా..? లేదంటే రూ.5వేలు అపరాధం?
, గురువారం, 31 ఆగస్టు 2017 (06:10 IST)
ఆధార్‌తో పాన్‌కార్డును అనుసంధానించేందుకు గడువు బుధవారం (ఆగస్టు 31)తో ముగియనుంది. ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ అనుసంధానం పూర్తి చేయకుండా ఆగస్టు 5 నాటికే మీరు రిటర్ను ఫైల్‌ చేసినా దానిని ఆదాయపన్ను (ఐటీ) శాఖ పరిగణలోకి తీసుకోదు. ఫలితంగా రిటర్ను ఫైలు చేయనట్లు భావిస్తారు. దీంతో తదనంతర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 
 
సెక్షన్‌ 142(1) ప్రకారం రిటర్న్‌ను సమర్పించాలని ఐటీ శాఖ నోటీసులు జారీ చేస్తుంది. దీనికి అదనంగా అసెస్‌మెంట్‌ అధికారి రూ.5,000 అపరాధ రుసుం కూడా విధించవచ్చు. ఐటీశాఖ నుంచి తిరిగి రావాల్సిన నిధులపై దీని ప్రభావం ఉండవచ్చు. అసలు రిఫండ్‌లను ఐటీశాఖ పరిశీలనలోకి తీసుకోకపోవచ్చు. ఇప్పటికే మీ ఆధార్‌, పాన్‌ అనుసంధానమై ఉన్నాయో లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా వినియోగదారుడిపైనే ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నంద్యాల ఫలితంతో వైకాపా నుంచి మరికొందరు... పత్తిపాటి జోస్యం