Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నంద్యాల ఫలితంతో వైకాపా నుంచి మరికొందరు... పత్తిపాటి జోస్యం

అమరావతి: కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి తప్పదని ముందుగానే ఊహించిన ప్రతిపక్ష వైఎస్ఆర్ సిపి నాయకులు ఇప్పటి నుంచే కారణాలు వెతుక్కునే పనిలో పడ్డారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎద్దేవా చేశారు. టీడీపీ-బీజేపీ కూటమికి 38 నుంచి

Advertiesment
నంద్యాల ఫలితంతో వైకాపా నుంచి మరికొందరు... పత్తిపాటి జోస్యం
, బుధవారం, 30 ఆగస్టు 2017 (22:13 IST)
అమరావతి: కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి తప్పదని ముందుగానే ఊహించిన ప్రతిపక్ష వైఎస్ఆర్ సిపి నాయకులు ఇప్పటి నుంచే కారణాలు వెతుక్కునే పనిలో పడ్డారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎద్దేవా చేశారు. టీడీపీ-బీజేపీ కూటమికి 38 నుంచి 40 సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సచివాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 20 ఏళ్ల తరవాత కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరవేయబోతుందన్నారు. 
 
ఇప్పటికే నంద్యాల ఫలితంతో వైకాపా నేతలకు తలబొబ్బి కట్టిందన్నారు. కాకినాడ ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ సిపి సింగిల్ డిజిట్ కు పరిమితమవుతోందన్నారు. పరాజయం తప్పదని ఇప్పటికే ఆ పార్టీ నేతలు నిర్ణయానికి రావడంతో, కారణాలు వెతుక్కునే పనిలో పడ్డారన్నారు. దీనిలో భాగంగానే అధికార పార్టీ డబ్బులు పంచిందని, అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, పోలీసులు పక్షపాతంగా వ్యవహరించారని ఆ పార్టీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. 
 
ప్రభుత్వం, అధికార పార్టీ నేతలపై బురద జల్లడమే పనిగా వైకాపా నాయకులు మాట్లాడుతున్నారన్నారు. వైకాపా ను నమ్ముకుని నంద్యాలలో బెట్టింగులు చేసిన వారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తలెత్తిందన్నారు. సీఎం నారా చంద్రబాబునాయుడు నిరంతరం రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. ఆయన కష్టాన్ని గుర్తించిన నంద్యాల ప్రజలు వెన్నుదన్నుగా నిలిచారన్నారు. బట్టలూడదీయమ్మన్నవారికే నంద్యాల ఓటర్లు సరైన గుణపాఠం చెప్పారన్నారు. 
 
నంద్యాల ప్రజలు అసహ్యించుకున్నా బుద్ధి మార్చుకోని జగన్... అధికార పార్టీ నేతలను కాకినాడలోనూ సముద్రంలో కలిపేయాలంటూ నోటికి పనప్పజెప్పారన్నారు. ఓటు అనే ఆయుధంతో జగన్ ను కాకినాడ ప్రజలు సముద్రంలో కలిపేయబోతున్నట్లు మంత్రి తెలిపారు. జగన్మోహన్ రెడ్ది ఇంకా ప్రజాస్వామ్యంలోకి అడుగుపెట్టినట్టు లేరన్నారు. జగన్మోహన్ రెడ్ది నంద్యాల ప్రజలను అవమానపర్చారన్నారు. నంద్యాలలో వైకాపాకు ఓటు వేసిన ప్రజలకు కనీసం కృతజ్ఞతలు చెప్పాలనే ఇంగిత జ్ఞానం కూడా జగన్‌కు లేకపోవడం దురదృష్టకరమన్నారు. 
 
రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజాసామ్య విలువలు అలవర్చుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్ది లాంటి నాయకుడు ఉండకూడదనే నిర్ణయానికి ప్రజలు వచ్చారని, నంద్యాల ప్రజలు ఓటుతో ఇప్పటికే తమ నిర్ణయాన్ని తెలిపారన్నారు. కాకినాడ ప్రజలు కూడా ఇటువంటి నిర్ణయాన్నే తీసుకున్నారన్నారు. సీఎం చంద్రబాబునాయుడు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమానికి కాకినాడ ప్రజలు పట్టం కట్టారన్నారు. 
 
టీడీపీ-బీజేసీ కూటమి 38 నుంచి 40 స్థానాలు కైవసం చేసుకుంటుందన్నారు. నంద్యాల ఫలితంతో పార్టీలో ఉండలా...వద్దా? అని వైకాపా తర్జనభర్జన పడుతున్నారన్నారు. కాకినాడ ఓటర్ల తీర్పు తరవాత జగన్ తో ప్రస్తుతం ఉన్నవారు కూడా ఉండబోరని మంత్రి ప్రత్తిపాటి తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోట్లు ఖర్చు పెడుతున్నా కనీస వసతులు లేకుంటే ఎలాగండీ? గంటా ఫైర్