Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముంబైలో భారీ వర్షాలు.. సముద్రాన్ని తలపిస్తున్న రహదారులు (video)

ముంబైలో భారీ వర్షాలు.. సముద్రాన్ని తలపిస్తున్న రహదారులు (video)
, గురువారం, 5 సెప్టెంబరు 2019 (17:34 IST)
ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రానికి సమాంతరంగా వున్న దేశ వాణిజ్య నగరం ముంబైలో భారీ వర్షాలు కురవడం ద్వారా రహదారులు సముద్రాన్ని తలపిస్తోంది. ఈ ఏడాది ముంబైలో భారీ వర్షపాతం నమోదైంది. 
 
ఈ ఏడాది రెండుసార్లు ముంబైని వర్షాలు ముంచేశాయి. ముంబై, మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలు నీట మునిగాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వరద నీరు వచ్చేసింది. నైరుతీ రుతుపవనాలు చురుగ్గా మారడమే ఇందుకు కారణమని వాతావరణ శాఖాధికారులు చెప్తున్నారు. 
 
ఇక భారీ వర్షాల కారణంగా ముంబై ప్రజలు ఉపయోగించే లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వరదల కారణంగా ట్రైన్ల రాకపోకలు రద్దు అయినాయి. కొన్ని విమాన సేవలు కూడా రద్దయ్యాయి. ఇక రోడ్లపై ప్రజలు తిరిగే పరిస్థితి లేదు. ఏది రోడ్డో తెలియని పరిస్థితి. ఇంకా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేయడంతో రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఇంకా ప్రజలు అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
ఇక ఉత్తరాదిన అట్టహాసంగా జరుపుకునే వినాయక చవితి ఉత్సవాలకు బ్రేక్ పడేలా వుంది. అలాంటిది ఈసారి వరదలు రావడం వల్ల చాలా ఇబ్బంది అవుతోంది. భక్తులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. సాధారణ పరిస్థితులు వచ్చేందుకు మరో నాలుగైదు రోజులు పట్టేలా ఉంది. రానున్న ఇరవై నాలుగు గంటలు రెండ్ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీంతో రానున్న రెండురోజుల పాటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. గత సెప్టెంబర్‌లో కురిసిన వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోదైనట్టు వాతవరణ శాఖ అధికారులు తెలిపారు.  
 
అలాగే భారీ వర్షాల కారణంగా రోడ్లపై నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ముంబైలోని ప్రముఖ సిద్ధి వినాయక ఆలయం ద్వారాలను తెరిచింది. ఇబ్బందులు పడుతున్న వారికి అక్కడే బస ఏర్పాటు చేసింది. 
webdunia
 
అంతేకాదు రాత్రికి భోజన ఏర్పాట్లు కూడా చేసింది. దీంతో వర్షంలో ఇరుక్కుపోయిన ప్రజలు సిద్ధి వినాయక ఆలయంకు చేరుకున్నారు. గురువారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఈ భారీ వర్షాల కారణంగా నలుగురు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అరాచకాలకు గొడుగు పట్టింది చంద్రబాబే : వైకాపా నేత సీఆర్