Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముంబైలో దారుణం.. యువతిపై కారు డ్రైవర్, స్నేహితుడి అత్యాచారం

Advertiesment
ముంబైలో దారుణం.. యువతిపై కారు డ్రైవర్, స్నేహితుడి అత్యాచారం
, మంగళవారం, 14 జులై 2020 (13:44 IST)
ముంబైలో దారుణం జరిగింది. 17 ఏళ్ల యువతి.. బెంగళూరులో తన ఇంటి నుంచి పారిపోయి ముంబై వచ్చింది. కుర్లాలో ఓ హాస్టల్‌లో వుంటూ హోటల్‌లో పనిచేసేది. అక్కడ 18 ఏళ్ల ఓ కుర్రాడు పరిచయమయ్యాడు. ఫ్రెండ్ అయ్యాడు. అతన్ని బాగా నమ్మింది. ఇద్దరూ కలిసి జీవించసాగారు. ఇంతలో మరిన్ని అనూహ్య మలుపులు. ఏం జరిగిందో తెలియదు. 
 
జూన్ 26న ఆ కుర్రాడు ధారావిలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జి నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె షాకైంది. అతని కుటుంబ సభ్యులు ఆమెను తప్పుపట్టారు. పోలీసులు ఆమెను రకరకాలుగా ప్రశ్నించారు. చివరకు ఆ సూసైడ్‌తో ఆమెకు సంబంధం లేదని తేల్చి ఆమెపై ఏ కేసూ రాయలేదు.
 
కానీ ఇంతలో అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరింది. అక్కడ నుంచి మళ్లీ పారిపోయేందుకు ప్రయత్నించి.. పుణె నుంచి బెంగళూరుకు బస్సులో వెళ్లాలని ప్లాన్ చేసుకుంది. చివరికి ఈ కేసును డీల్ చేసిన పోలీసులకు షాక్ తప్పలేదు. కారులో ఎక్కిన యువతి పూణేకి వెళ్లాలనుకుంది. 
 
పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా డ్యాక్సీ డ్రైవర్ల వద్ద జరిపిన దర్యాప్తులో కారు డ్రైవర్ అతని స్నేహితుడు కలిసి.. దారి మళ్లించారని తెలిసింది. సీసీటీవీ ఫూటేజ్‌లో ఆమె కొంతమంది టాక్సీ డ్రైవర్లతో మాట్లాడినట్లు కనిపించింది. వారివద్ద జరిపిన దర్యాప్తులో కారు డ్రైవర్, అతని స్నేహితుడు యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. 
 
ఇలా ముంబైలో కారును గుర్తించిన పోలీసులు డ్రైవర్‌ను పట్టుకున్నారు. ఆపై యువతిని డ్రైవర్ బంధించిన గది నుంచి రక్షించిన పోలీసులు... ఆస్పత్రికి పంపారు. ఇలా ఇంట్లోంచీ పారిపోయిన ఆమెకు అడుగడుగునా కష్టాలే ఎదురయ్యాయి. ఇప్పుడు ఆస్పత్రిలో ఆ యువతి కోలుకుంటోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి కూడా న్యాయ సలహాలిచ్చాం: ఏపీ ఉప ముఖ్యమంత్రి