Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీజేపీలో అమర్ సింగ్.. ములాయం తుది ఓటమి

ఎవరికోసంమైతే కొడుకును సైతం వదులుకోవడానికి నేతాశ్రీ ములాయం సిద్ధపడ్డాడో.. ఆ ప్రియనేస్తం అమర్‌సింగ్‌ సమాజ్ వాదీ పార్టీతోనే తెగతెంపులు చేసుకుని బీజేపీలో చేరబోతున్నట్లు సమాచారం రావడంతో ములాయంకు షాక్ మీద ష

బీజేపీలో అమర్ సింగ్.. ములాయం తుది ఓటమి
హైదరాబాద్ , బుధవారం, 18 జనవరి 2017 (05:04 IST)
ఎవరికోసంమైతే కొడుకును సైతం వదులుకోవడానికి నేతాశ్రీ ములాయం సిద్ధపడ్డాడో.. ఆ ప్రియనేస్తం అమర్‌సింగ్‌ సమాజ్ వాదీ పార్టీతోనే తెగతెంపులు చేసుకుని బీజేపీలో చేరబోతున్నట్లు సమాచారం రావడంతో ములాయంకు షాక్ మీద షాక్ తగిలింది. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్ష హోదాను, సైకిల్‌ గుర్తును కోల్పోయి పీకల్లోతు బాధలోఉన్న ములాయం సింగ్‌ యాదవ్‌కు ఇది తట్టుకోలేని విఘాతమనే చెబుతున్నారు. 
 
సమాజ్‌వాదీ పార్టీలో తలెత్తిన విబేధాలకు అసలు కారకుడిగా, 'శకుని మామ'గా విమర్శలు ఎదుర్కొన్న అమర్‌ సింగ్‌.. ఎన్నికల గుర్తుపై ఈసీ నిర్ణయం వెలువడకముందే లండన్‌ వెళ్లిపోయారు. 'నేను ఎప్పటికీ నేతాజీ(ములాయం) మనిషినే'అని పలుమార్లు బల్లగుద్దిచెప్పిన అమర్‌సింగ్‌.. సడన్‌గా సైడ్‌ మార్చారు. మంగళవారం ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై వివరణ ఇచ్చారు.
 
ఈసీ తీర్పుకు ముందే ఒక విషయం స్పష్టంగా చెప్పా.. నేను ములాయంవైపుగానీ, అఖిలేశ్‌వైపుగానీ లేను! ప్రస్తుతం లండన్‌లో ఉన్నా! సమాజ్‌వాదీ పార్టీ నాపై వేటు వేసింది. దాన్ని నేను అంగీకరిస్తున్నా. అమిత్‌షాతో మంతనాలు జరిపానని అందరూ అంటున్నారు. వాస్తవాలు ఎలా ఉన్నా, నేను బీజేపీలో ఎప్పుడు చేరబోయేది అందరికీ చెప్పాకే చేరుతా అని అమర్‌సింగ్‌ అన్నారు.
 
అఖిలేశ్‌లపై తనకున్న ప్రేమ గొప్పదని, ఖల్‌నాయక్‌(విలన్‌) అన్నా, శకుని అన్నా భరించగలిగే ఓపిక తనకుందని అమర్‌సింగ్‌ పేర్కొన్నారు. 'ఏది ఏమైనా నేతాజీ(ములాయం)  మాత్రం నన్ను విలన్‌గా చూడరు' అని విశ్వాసం వ్యక్తంచేశారు. ఎన్నికల గుర్తును గెలుచుకున్నవాళ్లు చెడ్డవాళ్లనో, ఓడినవాళ్లు మంచివాళ్లనో అనలేం, ఆమేరకు జరిగిన ప్రయత్నాలు సఫలమైనట్లుగానీ, విఫలమైనట్లుగానీ అభివర్ణించలేమని అమర్‌సింగ్‌ అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శాంతి కోసం లాహోర్‌కు వెళ్లినా వినలేదు: పాక్‌కు మోదీ చురకలు