Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శాంతి కోసం లాహోర్‌కు వెళ్లినా వినలేదు: పాక్‌కు మోదీ చురకలు

పాకిస్తాన్‌తో శాంతియుత సంబంధాల కోసం తాను చొరవ చేసి దౌత్యమర్యాదలను పక్కనపెట్టి మరీ లాహోర్‌కు వెళితే పాకిస్తాన్ తన విశ్వాసాన్ని వమ్ము చేసిందని ప్రధాని నరేంద్రమోదీ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertiesment
శాంతి కోసం లాహోర్‌కు వెళ్లినా వినలేదు: పాక్‌కు మోదీ చురకలు
హైదరాాబాద్ , బుధవారం, 18 జనవరి 2017 (04:51 IST)
పాకిస్తాన్‌తో శాంతియుత సంబంధాల కోసం తాను చొరవ చేసి దౌత్యమర్యాదలను పక్కనపెట్టి మరీ లాహోర్‌కు వెళితే పాకిస్తాన్ తన విశ్వాసాన్ని వమ్ము చేసిందని ప్రధాని నరేంద్రమోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకునేందుకు తాను ఎంత చొరవ తీసుకున్నా పాక్.. భారత్ పట్ల శత్రువైఖరిని ఆపలేదని, ఉగ్రవాద డాడులను అడ్డుకోలేదని  ప్రధాని అంతర్జాతీయ సమాజానికి మరోసారి గుర్తు చేసుకున్నారు. 
 
మూడు రోజులపాటు జరిగే ‘రైసినా చర్చల’ ప్రారంభోత్సవంలో మోదీ మంగళవారం ప్రసంగించారు. చర్చల ప్రక్రియ తిరిగి మొదలవ్వాలంటే... పాకిస్తాన్‌ ఉగ్ర పంథాను వీడాలని ప్రధాని ఉద్ఘాటించారు. మంచి, చెడు ఉగ్రవాదాలంటూ కృత్రిమ భేదాలు చూపడం సరికాదని పేర్కొన్నారు. ‘ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, ఎగుమతి చేస్తూ, విద్వేషాల్ని రెచ్చగొడుతూ మన పొరుగు దేశం ప్రపంచంలో ఏకాకి అయ్యింది’ అని అన్నారు. ఇరుగు పొరుగు దేశాల మధ్య సత్ససంబంధాలు నెలకొనాలనే ఉద్దేశంతో తన ప్రమాణ స్వీకారోత్సవానికి సార్క్‌ దేశాధిపతులను ఆహ్వానించానని వెల్లడించారు.
 
పొరుగు దేశాలతో సత్ససంబంధాలనే భారత్‌ కొరుకుంటోందని, దక్షిణాసియాలో శాంతి, సామరస్యం వెల్లివిరియాలన్నదే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ‘భారత్, చైనాలు అభివృద్ధి చెందడం ఇరు దేశాలకే కాకుండా మొత్తం ప్రపంచానికే అపూర్వమైన అవకాశంగా నేను భావిస్తున్నా’ అని పేర్కొన్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంపద పంపిణీ జరగాలంటే సంపద సృష్టి కావాల్సిందే: ముఖేష్ అంబానీ