రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీకి బెదిరింపు లేఖ అందింది. రూ.20 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామని దుండగులు ఆ లేఖలో బెదిరించారు.
దేశంలోనే మంచి షూటర్లు తమ వద్ద వున్నారని హెచ్చరించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ముఖేశ్ అంబానీ ఇళ్లు ఆంటాలియా వద్ద సెక్యూరిటీని మరింత పెంచారు.
దీనిపై ముఖేశ్ వ్యక్తిగత సిబ్బంది ఫిర్యాదు చేయడంతో గాందేవి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, విచారణ చేపట్టారు. ఐపీసీ సెక్షన్ 387, 506 (2) కింద కేసు నమోదు చేసుకున్నట్లు వివరించారు.