మలేషియాలో జరిగిన 'మిసెస్ ఇంటర్నేషనల్ గ్లోబల్ బ్యూటీ పేజెంట్ 2024' టైటిల్‌ను మధ్యప్రదేశ్‌కు చెందిన తాని గౌతమ్ గెలుచుకున్నారు. జబల్‌పూర్‌కు చెందిన, సీబీఐ అధికారి కావాలని కలలు కన్న తానీ, 30కి పైగా దేశాలు పాల్గొన్న పోటీలో పాల్గొన్న భారతదేశం నుండి ఒంటరి పోటీదారుగా బరిలోకి దిగారు.
ఈ క్రమంలో తాని 'బెస్ట్ నేషనల్ కాస్ట్యూమ్' టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. గృహిణి అయిన తానీకి పదేళ్ల కుమారుడు వున్నారు. దీనిపై తానీ మాట్లాడుతూ.. "నా కుటుంబం నాకు చాలా మద్దతు ఇచ్చింది. నేను భారతదేశం నుండి ఒంటరి పోటీదారుని, దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు గర్వపడుతున్నాను. టైటిల్ గెలుచుకున్నాను.
పోటీదారులు చాలా ప్రతిభావంతులు. మెక్సికో, రష్యా, ఉక్రెయిన్, థాయిలాండ్ మొదలైన దేశాల నుండి చాలా మంది పోటీదారులు ఉన్నారు. ఇది నాకు చాలా కఠినమైన, సవాలుతో కూడిన పోటీ" అని ఆమె తెలిపారు.
వివాహితులు తమ జీవితాల్లో ఏది చేయాలనుకుంటే అది చేయగలమని చెబుతూ స్ఫూర్తిని నింపాలని ఆకాంక్షించారు. వారి కలలను నెరవేర్చడానికి నేను వారందరికీ అవగాహన కల్పిస్తాను" అంటూ చెప్పుకొచ్చారు.