నిమోనియాకు నాటు చికిత్స పేరుతో నెలన్నర శిశువుకు 40 వాతలు పెట్టారు. శిశువుకు చికిత్స అందిస్తామని వేడి ఇనుప కడ్డీతో 40 వాతలు పెట్టిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్, శహడోల్ జిల్లాలోని గిరిజన ప్రాబల్యం గల హర్ది గ్రామానికి చెందిన చిన్నారి శిశువు మెడ, పొట్ట ఇతర భాగాలపై 40 వాతలను వైద్యులు గుర్తించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా వుందని వైద్యులు చెప్తున్నారు. మెరుగైన చికిత్స ఇస్తున్నట్లు తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. దీనిపై గ్రామ నర్సు, చిన్నారి తల్లి, తాతలను పోలీసులు అరెస్ట్ చేశారు.