Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒకే యువకుడితో తల్లీకూతుళ్ళ అక్రమ సంబంధం, అది తెలిసిపోవడంతో?

Advertiesment
ఒకే యువకుడితో తల్లీకూతుళ్ళ అక్రమ సంబంధం, అది తెలిసిపోవడంతో?
, ఆదివారం, 16 ఆగస్టు 2020 (15:24 IST)
అక్రమ సంబంధాలు ప్రాణాలను బలిగొంటున్నాయి. కొన్ని జీవితాలు పూర్తిగా నాశనమైపోతున్నాయి. రక్తం పంచుకుని పుట్టిన కూతురుకి మంచి బుద్ధి చెప్పాల్సిన తల్లి పెడదారిన వెళ్ళేలా చేసింది. తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తితో కుమార్తె కూడా శారీరక సంబంధం కొనసాగిస్తూ ఇద్దరూ ఒకే యువకుడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. 
 
తమిళనాడు రాష్ట్రం విల్లుపురంజిల్లా వడవంపాళయంకి చెందిన ధనశేఖర్ స్థానికంగా ఆలయ పూజారిగా పనిచేస్తున్నాడు. ఇతనికి రాజేశ్వరితో పెళ్ళయ్యింది. 20 యేళ్ళ కుమార్తె సత్య ఉంది. ఆమెకి పెళ్లయింది. పెళ్ళయిన రెండు నెలలకే సత్య భర్తతో గొడవపడి పుట్టింటికి వచ్చేసింది. 
 
అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటోంది సత్య. తమకు దగ్గర బంధువైన మురుగువేల్ అనే యువకుడితో అప్పటికే తల్లి వివాహేతర సంబంధం పెట్టుకుని వుంది. ఈ విషయం కూతురికి తెలుసు. దీనితో ఆమె కూడా అతనితోనే కూడా శారీరక సంబంధం పెట్టుకుంది. కూతురికి మంచి చెప్పాల్సిన తల్లి ఆ విషయాన్ని అస్సలు పట్టించుకోలేదు. 
 
ఈ విషయం కాస్త ధనశేఖర్‌కు తెలిసింది. తల్లీకూతుళ్ళనిద్దరినీ మందలించాడు. అయినా మార్పు రాలేదు. అయితే ధనశేఖర్‌ను చంపేస్తే హాయిగా ఉండొచ్చని నిర్ణయించుకుని తల్లీకూతుళ్ళు కలిసి హత్యకు ప్లాన్ చేశారు. ఈ నెల 12వ తేదీ రాత్రి ఇంటిలో నిద్రిస్తున్న ధనశేఖర్ గొంతు కోసేశారు తల్లీకూతుళ్ళు.
 
తమ ఇంట్లో దొంగలు పడ్డారని.. అడ్డుపడిన భర్తను నరికేసి వెళ్ళిపోయారంటూ నాటకమాడారు. పోలీసులు విచారణ జరుపగా అసలు విషయం బయటపడింది. నిందితులు ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్ 19, ఊబకాయులకు కరోనావైరస్ సోకితే, టీకా వేసినా...