Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నీ భర్త అందుకు పనికిరాడు, నువ్వెక్కడికెళ్లొస్తున్నావ్? కోడలికి అత్త ప్రశ్న

నీ భర్త అందుకు పనికిరాడు, నువ్వెక్కడికెళ్లొస్తున్నావ్? కోడలికి అత్త ప్రశ్న
, బుధవారం, 23 డిశెంబరు 2020 (16:08 IST)
పెళ్ళి చేసుకుంది. అందరిలాగే ఎన్నో ఆశలతో మెట్టినింట్లో అడుగుపెట్టింది. అయితే భర్త సంసారానికి పనికిరాడన్న విషయం ఆలస్యంగా తెలుసుకుని కుమిలిపోయింది. ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా 2 సంవత్సరాలు భర్త తనను దగ్గరకు తీసుకోకపోవడంతో కుమిలికుమిలి ఏడుస్తూ చివరకు కోర్టు మెట్లెక్కింది.
 
గుజరాత్ లోని హన్‌సోల్‌కు చెందిన జియా, ధ్రువ్‌లకు 2018 సంవత్సరంలో వివాహం జరిగింది. ధ్రువ్ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్నాడు. మంచి జీతం. అందంగా ఉంటాడు. జియా తండ్రికి ధ్రువ్ తండ్రి దూరపు బంధువు.
 
వారిద్దరు మంచి స్నేహితులు కూడా. దీంతో ఇద్దరి పెళ్ళిళ్లు జరిగిపోయాయి. కానీ మొదటి రాత్రి మాత్రం ఆమెకు కాళరాత్రిగా మిగిలిందట. ఎన్నో ఆశలతో శోభనం గదిలోకి వెళితే భర్త ఇప్పుడే ఇదంతా వద్దు తరువాత చూద్దామంటూ నిద్రపోయాడట.
 
ఆ తరువాత నుంచి అదే తంతు. పెళ్ళయి వారంరోజుల తరువాత థాయ్‌ల్యాండ్‌కు హనీమూన్ పంపారట జియా తండ్రి. అయితే అక్కడికి వెళ్ళిన తరువాత కూడా ప్రతిరోజు నిద్రపోవడమే పనిగా పెట్టుకున్నాడట ధ్రువ్. తాను మానసికంగా బాధపడుతున్నానని.. కొన్నిరోజులు ఇద్దరం కలవడం వద్దని ధ్రువ్ చెప్పేవాడట.
 
భర్త అలా అనేసరికి జియా ఊరుకుంది. ఇలా రెండు సంవత్సరాలు గడిచాయి. అంతేకాదు జియా ఇంటి నుంచి బయటకు వెళితే ఆమె అత్త ఆమెను ఫాలో అయ్యేదట. ఎవరితో కలిశావు.. ఏం మాట్లాడుతున్నావంటూ ప్రశ్నించేదట. 
 
సరిగ్గా వారంరోజుల క్రితం తన కుమారుడు చిన్నప్పుడు మిద్దెపై నుంచి కిందపడిపోయాడని.. ప్రైవేటు పార్ట్ దగ్గర గాయమైందని కూడా చెప్పిందట. దీంతో జియా షాక్‌కు గురైంది. వెంటనే తేరుకుని అత్త, భర్తల వ్యవహారాన్ని కోర్టు ముందు న్యాయవాదికి చెప్పుకుంది.
 
పక్కకు వెళితే నా భర్త తోసేస్తున్నాడు. నేనేం చెయ్యాలి. అత్త సూటిపోటి మాటలంటోంది. నాకు పెళ్ళయి రెండు సంవత్సరాలవుతోంది. నాకు విడాకులు ఇప్పించండి అంటూ ప్రాధేయపడిందట వివాహిత. దీంతో న్యాయవాది ఆమెకు విడాకులు మంజూరు చేసారట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏడుకొండలవాడిని మేము దర్శించుకుని తీరాల్సిందే, కన్నీటి పర్యంతమైన భక్తురాలు