Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమిళనాడు పాలి'ట్రిక్స్' : అన్నాడీఎంకే ఆహ్వాన పత్రికలో స్టాలిన్ పేరు

తమిళనాడు రాజకీయాల్లో ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బద్ధశత్రువులుగా ఉండే డీఎంకే, అన్నాడీఎంకేలకు చెందిన నేతలు ఒకే వేదికపై కనిపించనున్నారు. అన్నాడీఎంకే అధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమ ఆహ్వాన పత్రి

Advertiesment
తమిళనాడు పాలి'ట్రిక్స్' : అన్నాడీఎంకే ఆహ్వాన పత్రికలో స్టాలిన్ పేరు
, మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (12:36 IST)
తమిళనాడు రాజకీయాల్లో ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బద్ధశత్రువులుగా ఉండే డీఎంకే, అన్నాడీఎంకేలకు చెందిన నేతలు ఒకే వేదికపై కనిపించనున్నారు. అన్నాడీఎంకే అధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమ ఆహ్వాన పత్రికలో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ పేరును ముద్రించారు. ఇది ఇపుడు తమిళనాట సంచలనంగా మారింది. ఈ వివరాలను పరిశీలిస్తే..
 
తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలో దివంగత డాక్టర్ ఎంజీఆర్ శతజయంతి వేడుకలను గత యేడాది కాలంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా, ఈనెల 30వ తేదీన చెన్నైలో ముగింపు వేడుకలు జరుగనున్నాయి. ఇందుకోసం అన్నాడీఎంకే భారీగా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే, వేదికపై ప్రసంగించే నేతల పేర్లతో ఓ ఆహ్వాన పత్రికను కూడా ముద్రించింది. 
 
ఇందులో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో పాటు.. ఆయన చెల్లెలు, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి పేర్లతో పాటు అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ పేర్లను ముద్రించారు. ఈ ఆహ్వాన పత్రి ఇపుడు తమిళనాట సంచలనం రేకెత్తిస్తోంది.
 
ఈ అంశంపై మంత్రి, అన్నాడీఎంకే నేత పాండియరాజన్ మాట్లాడుతూ, ఎంజీఆర్ శతజయంతి ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించామని... ఈ కారణంగానే వేడుకలకు అన్ని పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే అధినేత స్టాలిన్‌ను, ఆ పార్టీ ఎంపీ కనిమొళిని ఆహ్వానించామని తెలిపారు. 
 
వేదికపై ప్రసంగించాలనే సదుద్దేశంతోనే వక్తల జాబితాలో వారి పేర్లను ముద్రించామని తెలిపారు. అదే విధంగా దినకరన్ కూడా ప్రసంగించాలనే ఆయన పేరును కూడా ముద్రించామని చెప్పారు. అయితే, ఈ వేడుకల్లో పాల్గొనాలా? వద్దా? అనే నిర్ణయాన్ని మాత్రం వారి అభీష్టానికే వదిలేస్తున్నామని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అదుపు తప్పి లోయలోకి వెళ్లిన బస్సు...తర్వాత ఏమైందంటే