డిఎంకే పార్టీ ముఖ్య నేత కరుణానిధి మరణం తరువాత ఆ బాధ్యతలను చేపట్టారు స్టాలిన్. పార్టీలో కీలక వ్యక్తిగా ఉంటూ నేతలందరినీ కలుపుకుని నిర్మాణాత్మక ప్రతిపక్ష నేతగా ముందుకు వెళుతున్నారు స్టాలిన్. అయితే తన కుటుంబ సభ్యులకు పార్టీలోకి తీసుకుని పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా సాగేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
అంతే కాదు ఇష్టం లేకపోయినా రాజకీయాల్లోకి బలవంతంగా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. స్వయంగా తన కొడుకు ఉదయనిధిని రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారు స్టాలిన్. రాజకీయాలంటే ఉదయనిధికి ఏ మాత్రం ఇష్టం లేదు. ప్రస్తుతం తమిళ సినిమాల్లో ఉదయనిధి బిజీబిజీగా ఉన్నారు.
అయితే సినిమాల కన్నా రాజకీయాలే నీకు మంచిదని చెప్పి పార్టీలో బాధ్యతలు అప్పజెప్పేశారు స్టాలిన్. డిఎంకే పార్టీ యూత్ వింగ్ సెక్రటరి బాధ్యతలను అప్పగించారు. 35సంవత్సరాలు స్టాలిన్ ఈ పదవిలో ఉన్నారు. తన కుటుంబ సభ్యులే ఇలాంటి బాధ్యతలు చేపట్టాలని ఆయన ఒక్కొక్క పదవిని వారికే అప్పజెబుతూ వస్తున్నారు. తండ్రి చెప్పడంతో వద్దనలేక పదవిని తీసేసుకున్నాడు ఉదయనిధి. అయితే సినిమాలు కూడా తాను చేస్తానని చెబుతున్నాడు.