Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సంపూర్ణ మద్య నిషేధం : ఎన్నికల హామీని నిలబెట్టుకున్న ఎంఎన్ఎఫ్

సంపూర్ణ మద్య నిషేధం : ఎన్నికల హామీని నిలబెట్టుకున్న ఎంఎన్ఎఫ్
, ఆదివారం, 10 మార్చి 2019 (14:42 IST)
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని మిజోరం నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) నిలబెట్టుకుంది. అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామంటూ ఎన్నికల హామీ ఇచ్చింది. ఇపుడు ఆ హామీని నిలబెట్టుకుంది. 
 
శుక్రవారం సీఎం జొరాంతాంగా నేతృత్వంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో మిజోరం లిక్కర్ ప్రొహిబిషన్ బిల్-2019కి ఆమోదం లభించింది. త్వరలో జరుగనున్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. 
 
ఈ బిల్లు సభ ఆమోదం పొందగానే రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లోకి రానుంది. గతంలో 1997 నుంచి 2015 జనవరి వరకు రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమల్లో ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2015 మార్చిలో ఈ నిషేధాన్ని ఎత్తివేసింది. తిరిగి ఇపుడు నిషేధం విధించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కవితను కలిసిన సబితా ఇంద్రారెడ్డి.. త్వరలో తెరాస తీర్థం?