Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాతృ దినోత్సవం సందర్భంగా మిరాకల్ ఫౌండేషన్ అనాధల కోసం...

Advertiesment
Miracle Foundation India
, శుక్రవారం, 10 మే 2019 (20:55 IST)
న్యూ ఢిల్లీ: మాతృదినోత్సవం 2019 దగ్గర పడుతూండడంతో, మిరాకిల్ ఫౌండేషన్ ఇండియా, ఒక పూర్తి లైన్సెన్స్ పొందిన సెక్షన్ 25 లాభాపేక్ష-రహిత సంస్థ, శిశు సంరక్షణాలయాలలో నివసించు పిల్లల కోసం ఒక అనుకూల వాతావరణం కల్పించడానికి శరణాలయ తల్లులకు మద్ధతు ఇవ్వడానికి తన ’మాతృదినోత్సవ" ప్రచారాన్ని ప్రకటించింది. దీనితో పాటుగా, ఈ పిల్లల రక్తసంబంధీక తల్లులను, వారి పిల్లవానిని తిరిగి కుటుంబంలోని ఆహ్వానించుటకు సిద్ధం చేయడం మరియు సాధికారత కల్పించడం అనేవి ఈ ప్రచార లక్ష్యం.
 
ప్రపంచవ్యాప్తంగా 80 లక్షల మంది పిల్లలు, ఇలాంటి సంస్థలలో నివసిస్తున్నారు (యునిసెఫ్). ఈ పిల్లలలో చాలామంది, పోషకాహారం, శుభ్రమైన నీరు, నాణ్యమైన విద్య మరియు ఆరోగ్య సంరక్షణ అందకుండానే అనేక శరణాలయాలలో మగ్గుతున్నారు. ఆశ్చర్యంగా, ఈ పిల్లలలో 80% మందికి తమ కుటుంబాలు తిరిగి లభించాయి (యునిసెఫ్ 2015). చాలా కుటుంబాలు పిల్లలకు సంరక్షణ అందించుటకు తమకు సరియైన సహకారం ఉంటే వారిని శరణాలయాలో వదిలేవారు కాదు. అందుకే మిరాకిల్ ఫౌండేషన్ ఇండియా, ఈ అనాథ మరియు దుర్బల పిల్లల జీవితంలో మార్పు తీసుకురావడం కోసం పనిచేస్తోంది మరియు ఇప్పుడు శరణాలయాలలో నివసిస్తున్న ప్రతి పిల్లవాడు కూడా ఒక ప్రేమపూర్వక కుటుంబాన్ని, చివరకు పొందునట్లుగా పనిచేస్తోంది. 
 
ఈ సంస్థ 2000 సంవత్సరంలో మాతృదినోత్సవం నాడు స్థాపించబడింది మరియు ఇప్పటి వరకు, 7500+ పైగా అనాథ మరియు దుర్బల పిల్లల జీవితాలలో ప్రభావవంతమైన మార్పును తీసుకువచ్చింది. ప్రతిసంవత్సరం, మాతృదినోత్సవం రోజున, మిరాకిల్ ఫౌండేషన్ ఇండియా, వ్యక్తుల జీవితాలలో తల్లుల వంటి వారిని గౌరవించడంలో దానం చేయడానికి ఆహ్వానిస్తోంది. ఈ దానాలు, పిల్లలను తమ కుటుంబాలతో తిరిగి కలపడంలో వినియోగించబడతాయి.
 
ఈ సంవత్సరం, మాతృదినోత్సవ ప్రచారంలో ఒక నాలుగు-శాఖల పద్ధతి ఉంటుంది, ఇది శరణాలయాలలోని తల్లులు, పిల్లల మార్పిడి ప్రతి దశలో వారి పిల్లలకు ఒక అనుకూల వాతావరణం కల్పించుట మరియు వారు తమ కుటుంబాలతో తిరిగి కలుసుకునేంతవరకు వీలయినంతా వారికి తోడ్పాటును అందించుటే లక్ష్యంగా కలిగి ఉంది. ఇది పిల్లల అవసరాలు పూరించుట, పిల్లలు తమ కుటుంబానికి తిరిగి వెళ్ళు మార్పుపై శిక్షణ అందిచుటపై మరియు బంధాన్ని నిలుపుటలో, శరణాయలయ తల్లుల సామర్థ్యాలను నిర్మించుట ద్వారా కొనసాగించబడుతుంది. 
 
శిక్షణ ద్వారా, శరణాలయ తల్లులు, కుటుంబ సమూహాల ద్వారా మరియు శరణాలయాలవద్ద రోజువారీ కార్యాచరణల ద్వారా, ఒక అనుబంధాన్ని సృష్టించగలుగుతారు మరియు శాశ్వత కుంటుంబంలో మమేకమయ్యేంత వరకు కూడా, ఈ పిల్లలు ప్రేమించబడునట్లుగా, చదువుకొనునట్లుగా, ఆరోగ్యంగా మరియు సురక్షితంగా ఉండునట్లుగా నిర్ధారించుకుంటారు. ప్రచారం నుండి సేకరించబడిన నిధులు, శరణాలయ తల్లులకు, స్వీయ అవగాహన, ఆత్మ విశ్వాసం మరియు ఆత్మగౌరవాన్ని కలిగించి, పిల్లల పట్ల మెరుగైన శ్రద్ధ వహించి, శరణాలయాలలోని పిల్లలతో కలిసి సమయం వెచ్చించి వారి వీడ్కోలు కిట్స్ సిద్ధం చేయడానికి సహాయపడతాయి.
 
మరొకవైపు, రక్తసంబంధీక తల్లులు, తమ పిల్లలకు తగిన సంరక్షణ అందించాలంటే వారికి తగిన సహకారం మరియు వనరులు లేకపోవడం వలన, కొన్ని సంవత్సరాలుగా తమ పిల్లలను తమ నుండి దూరంగా ఉంచి ఉంటారు. మాతృదినోత్సవ ప్రచారం నుండి పొందిన కొన్ని నిధులు, ఈ రక్తసంబంధీక తల్లులు తమ పిల్లవానిని ఇంటికి తిరిగి ఆహ్వానించుటకు మరియు తమ పిల్లలను అనాథ శరణాలయంలో కాకుండా తమ కుటుంబంలో ఉంచుకోవడంలో వారికి తగిన మద్ధతును ఇవ్వడానికి, కౌన్సిలింగ్ మరియు సిద్ధం చేయడానికి, పంపబడతాయి. 
 
మాతృదినోత్సవ ప్రచారం గురించి మాట్లాడుతూ, నివేదిత దాస్ గుప్త, ఇండియా కంట్రీ హెడ్, మిరాకిల్ ఫౌండేషన్, ఇలా అన్నారు,"అనాథ శరణాలయాలలో నివసించు 80% కంటే ఎక్కువ మంది పిల్లలకు తల్లిదండ్రులు ఉంటారు, కానీ వారికి సామాజిక-ఆర్థిక  పరిస్థితులు బాగులేకపోవడం వలన, తగిన వనరులు లేకపోవడం వలన వారి పిల్లలకు సంరక్షణ అందించలేకపోతున్నారు. ఫలితంగా ఆ పిల్లలు వారి కుటుంబం నుండి, ప్రత్యేకంగా వారి తల్లుల నుండీ దూరంగా నివసించాల్సి వస్తోంది, ఈ పిల్లలకు బంధం, అనుబంధం మరియు సన్నిహిత సంరక్షణ కరవైంది. 
 
ప్రతి పిల్లవానికి ఒక ప్రేమపూర్వక, సంరక్షణా పూర్వక కుటుంబ వాతావరణం కావాల్సి ఉంది, మరియు వారి తల్లితో దేనినీ పోల్చలేము. మిరాకిల్ ఫౌండేషన్ ఇండియాలో, ఈ వాస్తవాన్ని వీలయినంతమంది ఎక్కువ పిల్లలకు కలిగించాలనేదే మా లక్ష్యం. మా మాతృదినోత్సవ రోజు ప్రచారం, ఈ దిశలో మరొక ముందడుగు, ఈ పిల్లల అనాధ గృహ తల్లులు మరియు రక్తసంబంధీక తల్లులకు, ప్రతి శిశువు కూడా, తిరిగి వారి స్వంత ఇళ్ళకు వెళ్ళడం లేదా ప్రస్తుతానికి ఇంటికి దూరంగా ఉన్న ఆవాస గృహాలకు మరలడం, వంటి వారి   అవసరాలను పూరించుటలో సహాయపడుటకు సాధికారిత కల్పించబడుతుంది.”
 
ఒక తేడాను చూపడానికి, చేయవలసినదేమిటంటే, వారి తల్లికి – లేదా వారి జీవితాలలో తల్లిసమానురాలైన వారికి గౌరవంగా ఒక దానాన్ని చేయడమే. ఈ సొమ్ము పన్నురహితంగా కూడా ఉంటుంది. దీనికి బదులుగా వారికి ఒక అందమైన ఫోటోగ్రాఫ్ అందుతుంది, దీనిని వారు వ్యక్తిగతీకరించుకుని, వారికి గౌరవీయులైనవారితో పంచుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయనగరం లోక్‌సభ 2019 ఫలితాలు