Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రమాదకరమైన లింగ మూస పద్ధతులపై ASCI మార్గదర్శకాలను విడుదల చేసిన మంత్రి స్మృతి ఇరానీ

Advertiesment
Smriti
, గురువారం, 9 జూన్ 2022 (23:08 IST)
అడ్వర్టయిజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఆస్కీ) విజయవంతంగా తమ జెండర్‌ నెక్ట్స్‌ నివేదికను అక్టోబర్‌ 2021లో విడుదల చేసింది. అస్కీ- ఫ్యూచర్‌బ్రాండ్స్‌ సంయుక్తంగా విడుదల చేసిన అధ్యయనం ద్వారా ప్రమాదకరమైన లింగ మూస పద్ధతులను నిరోధించే రీతిలో మార్గదర్శకాలనూ విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలను ఇండియా హ్యాబిటట్‌ సెంటర్‌ వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మహిళ-శిశు సంక్షేమ శాఖామాత్యులు శ్రీమతి స్మృతి ఇరానీ కూడా పాల్గొన్నారు.

 
లింగ చిత్రణ అనేది అత్యంత క్లిష్టమైన, చికాకు కలిగించే అంశం. ఈ మార్గదర్శకాలు ఆస్కీ చాఫ్టర్‌ 3(ప్రమాదకరమైన పరిస్ధితులకు సంబంధించి)కు వివరణ అందిస్తాయి. వ్యక్తులు లేదంటే సమాజానికి హానికరమైన ప్రకటనలపై ఇది చర్యలు తీసుకుంటుంది. లింగపరంగా మూసధోరణులు అత్యంత ప్రమాదకం. ఎందుకంటే, ఇవి వ్యక్తులను నిర్ధిష్టమైన పాత్రలకు మాత్రమే పరిమితం చేయడంతో పాటుగా సమాజానికి హాని కలిగించే కొన్ని రకాల పద్ధతులను శాశ్వతం చేస్తాయి. ప్రకటనలు, అవి సూక్ష్మ- అవ్యక్త వర్ణనల ద్వారా కొన్ని హానికరమైన మూస పద్ధతులను బలపరుస్తుంది. వ్యక్తులు, సమూహాల ఆకాంక్షలనూ విస్మరిస్తుంది. కాంటార్‌ ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో 64% మంది వినియోగదారులు హానికరమైన లింగ మూస పద్ధతులను నిర్మూలించడానికి బదులు ఈ ప్రకటనలు బలపరుస్తాయని నమ్ముతున్నారు.

 
ఈ మార్గదర్శకాలు, ఆత్మగౌరవం- సాధికారత- స్నేహపూర్వక కార్యాచరణ అమలు చేసే ప్రకటనకర్తలు, క్రియేటర్లను ప్రోత్సహిస్తుంది. తమ ప్రకటనలలో లింగం యొక్క చిత్రణ అంచనా వేయడం- మూల్యాంకనం చేయడంలో వాటాదారులకు మార్గనిర్దేశనం చేస్తుంది. అలాగే 3ఎస్‌ ఫ్రేమ్‌వర్క్‌కు తోడ్పడుతూనే అడ్వర్టయిజింగ్‌లో ప్రవేశించే అసహజ మూస పద్ధతులు, ట్రోప్స్‌ నుంచి రక్షణ కోసం చెక్‌లిస్ట్‌నూ అందిస్తుంది.

 
ప్రమాదకరమైన లింగ మూసధోరణులకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసే సమయంలో గౌరవనీయ స్త్రీ, శిశు అభివృద్ధి శాఖామాత్యులు శ్రీమతి స్మృతి జుబిన్‌ ఇరానీ మాట్లాడుతూ, ‘‘ప్రకటనల ప్రపంచంలో వస్తోన్న గణనీయమైన మార్పుల పట్ల మహిళలు సంతోషంగా ఉన్నప్పటికీ, మా తరపు మహిళలు మాత్రం అసహనంతో ఉన్నాము. ప్రకటనల ప్రపంచంలోని పురుషులు మాత్రమే కాదు మహిళలు సైతం తమ గళం వినిపించాల్సిన సమయమిది. ఇది చాలా ముఖ్యమైన ముందడుగుగా కూడా నిలుస్తుంది. మన ఆలోచనలు మార్చడానికి సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. అది అవసరం. ఈ విభాగంలో మనం చేసే పని మరింత వేగంతో చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఆస్కీ లాంటి సంస్థలు దీనికి నేతృత్వం వహించాల్సి ఉంది. దాని సభ్యులతోనే చర్యలు ప్రారంభం కావాలి’’ అని అన్నారు.

 
ఆస్కీ ఛైర్మన్‌ సుభాష్‌ కామత్‌ మాట్లాడుతూ, ‘‘ఈ నూతన మార్గదర్శకాలను పరిశ్రమతో పాటుగా యునిసెఫ్‌, అన్‌స్టీరియోటైప్‌ అలయన్స్‌ సహా పౌర సమాజ సంస్ధలను సంప్రదించిన తరువాత తీర్చిదిద్దాము. మరింత బాధ్యతాయుతమైన, ప్రగతిశీల కథనాన్ని రూపొందించడానికి ఆస్కీ యొక్క ఎజెండాను బలోపేతం చేయడంలో ఈ మార్గదర్శకాలు ఓ పెద్ద ముందడుగుగా నిలుస్తాయి. ఈ మార్గదర్శకాలకు మద్దతునందించిన ప్రభుత్వం, స్మృతి ఇరానీ, ఈ ప్రయాణంలో మాతో పాటు ఈ ప్రయాణంలో భాగస్వాములకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డైరెక్టుగా వస్తే తట్టుకోగలవా... పప్పు తిని పడుకో చిట్టయ్యా...