Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాల్ సెంటరులో దారుణం.. ఉద్యోగం మానేస్తున్నారని ఉద్యోగుల హత్య

murder
, బుధవారం, 7 జూన్ 2023 (14:49 IST)
మెక్సికోలో దారుణం జరిగింది. ఓ కాల్ సెంటరులో పని చేస్తూ వచ్చిన కొందరు ఉద్యోగులుత తమ జాబ్‌లకు రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసిన యాజమాన్యం వారిని హత్య చేసింది. ఇది స్థానికంగా కలకలం రేపుతోంది. అమెరికన్లను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న మెక్సిన్‌లో ఓ డ్రగ్ కార్టెల్‌లో ఈ దారుణం వెలుగుచూసింది. ఈ విషయాన్ని అమెరికా, మెక్సికో అధికారులు ధృవీకరించారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మెక్సికోలోని గువాడలజరా సమీపంలో జలిసో న్యూ జనరేషన్‌ కార్టెల్‌ ఆధ్వర్యంలో ఆ కాల్‌సెంటర్‌ నడుస్తోంది. మెక్సిలోనే అత్యంత హింసాత్మక ముఠాగా జలిసోకు పేరుంది. అయితే, అందులో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు కనిపించకుండా పోయారు.
 
గత నెల 20 నుంచి 22వ తేదీల మధ్య ఆరుగురు పురుషులు, ఇద్దరు మహిళల జాడ కనిపించలేదు. వారంతా 30ఏళ్లలోపు వారే. దీంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే శరీర భాగాలతో కూడిన కొన్ని ప్లాస్టిక్‌ కవర్లు ఆ ప్రాంతంలో బయటపడ్డాయి. వీటికి ఫోరెన్సిక్‌ పరీక్షలు నిర్వహించగా.. అవన్నీ తప్పిపోయిన ఆ కాల్‌ సెంటర్‌ ఉద్యోగులవేనని తేలింది.
 
మెక్సికోలో అత్యంత హింసాత్మక గ్యాంగ్‌గా పేరున్న ఈ జలిసో కొత్త తరం ముఠా.. సాధారణ కార్యకలాపాలు కాకుండా డ్రగ్స్‌ అక్రమరవాణా, దోపిడీ, కిడ్నాప్‌ల వంటి వాటికి పాల్పడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడుల పేరిట అమెరికన్లు, కెనడియన్లే లక్ష్యంగా ఈ కాల్‌సెంటర్‌ ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. 
 
అయితే, అందులో పనిచేసే యువతీ, యువకుల దారుణ హత్యలకు ఖచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ.. వారంతా ఉద్యోగం మానేసేందుకు ప్రయత్నిస్తున్నందునే ఈ దారుణాలకు తెగబడినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఆ ఉద్యోగుల కుటుంబీకులు మాత్రం తమ పిల్లలు సాధారణ కాల్‌సెంటర్‌లోనే పనిచేస్తున్నట్లు భావిస్తున్నామని దర్యాప్తు సంస్థలకు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాలేజీ విద్యార్థినిపై హాస్టల్‌లో అత్యాచారం.. ఆపై హత్య...