Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమించింది.. ఆపై వేరే వ్యక్తితో ప్రేమలో పడింది.. అందుకే కాల్చేశాను..

ప్రేమించింది. ఆపై వేరే వ్యక్తితో ప్రేమలో పడిందనే అక్కసుతో ఇంటి ఎదుటే ఓ యువతిని కాల్చిచంపాడు. ఈ ఘటన న్యూఢిల్లీలో జరిగింది. తనతో కాకుండా వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండడమే కాకుండా తనకు అబద్దాలు చెప్పడం స

Advertiesment
Mercedes murder: Friend accused of shooting dead Najafgarh teen arrested
, శనివారం, 24 డిశెంబరు 2016 (11:12 IST)
ప్రేమించింది. ఆపై వేరే వ్యక్తితో ప్రేమలో పడిందనే అక్కసుతో ఇంటి ఎదుటే ఓ యువతిని కాల్చిచంపాడు. ఈ ఘటన న్యూఢిల్లీలో జరిగింది. తనతో కాకుండా వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండడమే కాకుండా తనకు అబద్దాలు చెప్పడం సహించలేక యువతిని కాల్చిచంపానని నిందితుడు తెలిపాడు. ఈ ఘటన న్యూఢిల్లీలో రెండు రోజుల క్రితం జరిగింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
 
న్యూఢిల్లీలోకి నజఫ్ గడ్‌కు చెందిన సిమ్రాన్ అనే యువతిని శుభం గుప్తా అనే యువకుడు రెండు రోజుల క్రితం ఇంటి ఎదుటే తుపాకితో కాల్చిచంపాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. అయితే సిమ్రాన్ వ్యవహరశైలి నచ్చకే ఆమెను చంపినట్టు నిందితుడు పోలీసులకు తెలిపాడు. సిమ్రాన్‌పై కాల్పులు జరిపి ఢిల్లీలోని తన బంధువుల ఇంట్లో ఉన్న శుభం గుప్తాను పోలీసులు అరెస్టు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామ్మోహన్‌రావుకు గుండెపోటు.. పోరూర్ రామచంద్ర ఆస్పత్రిలో చేరిక..