Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భోజనం పెట్టి మచ్చిక చేసి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం.. మీరట్‌లో వృద్ధ కామాంధుడు

Advertiesment
భోజనం పెట్టి మచ్చిక చేసి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం.. మీరట్‌లో వృద్ధ కామాంధుడు
, ఆదివారం, 5 మే 2019 (10:14 IST)
అతని వయసు 63 యేళ్ల. భార్య లేదు. దీంతో ప్రతి రోజూ గుడికి వచ్చిన పూజలు చేసేవాడు. అక్కడకు వచ్చే భక్తులకు అన్నదానం చేసేవాడు. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారు. వీరిపై కన్నేసిన ఆ వృద్ధుడు వారిని మచ్చిక చేసుకునేవాడు. ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టేవాడు. అదీ కూడా పోర్న్ వీడియోలు చూపిస్తూ మనవరాలి వయసున్న ముక్కుపచ్చలారని బాలికపై లైంగికదాడికి పాల్పడుతూ వచ్చాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని మీరట్‌‌కు చెందిన విమల్‌ చంద్‌ (63) అనే వ్యక్తి బీమా సంస్థలో ఉన్నతోద్యోగిగా పని చేసి గత 2016లో పదవీ విమరణ చేశాడు. అదే యేడాది ఆయన భార్య చనిపోయింది. కూతురు విదేశాల్లో ఉంటోంది. రాజభవనం వంటి ఇంట్లో విమల్ చంద్ ఒక్కరే నివసిస్తూ వచ్చాడు. ఆ ఇంట్లోనే బాలికలపై అతడు ఘోరాలకు పాల్పడ్డాడు.
 
చంద్‌ ఇచ్చే డబ్బులు, బట్టలకు ఆశపడి పేద కుటుంబాలకు చెందిన బాలికలు తమకు తాముగా అతడి ఇంటికొచ్చేవారు. ఆ చిన్నారులపై అతడి ఈ రాక్షసకేళి ఇంట్లో బిగించుకున్న సీసీ ఫుటేజీల వల్లే బయట ప్రపంచానికి తెలిసింది. యేడాది క్రితం ఇంట్లోని హాలు, బెడ్‌రూం, లివింగ్‌ రూం, వంటగదితో పాటు బాత్‌రూంను కూడా వదిలిపెట్టకుండా మొత్తంగా 13 సీసీ కెమెరాలు అమర్చాడు. 
 
వీటిలో కొన్ని పాడైపోవడంతో గత నవంబరులో కశ్యప్‌ అనే టెక్నీషియన్‌ను పిలిపించాడు. బాగుచేసే క్రమంలో కశ్యప్‌ సీసీ కెమెరాల్లోని దృశ్యాలు చూసి షాకయ్యాడు. వాటిని డీవీఆర్‌లో డౌన్‌లోడ్‌ చేసుకొని.. అడిగినంత డబ్బివ్వాలంటూ విమల్‌ చంద్‌ను బ్లాక్‌మెయిల్‌ చేశాడు. చివరికి విషయం పోలీసుల దాకా వెళ్లడంలో విమల్‌చంద్‌ ఘోరాలు వెలుగుచూశాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు. విమల్ చంద్, కశ్యప్‌లను పోలీసులు అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పార్కులో ప్రియుడితో భార్య... భర్తకు అడ్డంగా చిక్కింది...