ఉత్తరప్రదేశ్‌లో మాంసం దుకాణాలకు నిప్పు... రెండు రోజుల్లోనే
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సర్కారు కొలువుదీరింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కరుడుగట్టిన హిందుత్వవాది యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు స్వీకరించారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సర్కారు కొలువుదీరింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కరుడుగట్టిన హిందుత్వవాది యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు స్వీకరించారు. ఈయన సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రెండు రోజుల్లోనే యూపీని హత్రాస్‌లో మాంసం దుకాణాలను గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. ఈ రెండు షాపులు ముస్లిం వ్యాపారులకు చెందినవి కావడం గమనార్హం. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని తెలిసింది.
ఇదిలావుంటే మాంసం దుకాణాలను తగులబెట్టిన వ్యవహారం వెనుక సంఘ విద్రోహ శక్తులున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గొడ్డు మాంసాన్ని విక్రయిస్తున్న వ్యాపారులపై దాడులు జరిగిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఇపుడు యూపీలో కూడా ఈ తరహా సంఘటన జరగడం గమనార్హం. ముఖ్యంగా, యోగి ఆదిత్యనాథ్ యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే ఈ ఘటన జరగడం సర్వత్రా చర్చనీయాంశమైంది.