Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కారు లాక్‌తో తంటా.. ఎనిమిదేళ్ల బాలుడు ఊపిరాడక మృతి.. ఎక్కడంటే?

Advertiesment
Mathura
, శనివారం, 19 జూన్ 2021 (23:07 IST)
కారు లాక్ చేసిన తర్వాత సరిగ్గా చూసుకోలేదు. ప్రమాదవశాత్తు కారులో ఇరుక్కుని ఊపిరాడక చనిపోతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇలాగే మధురలో ఓ ఘటన చోటు చేసుకుంది. లాక్ చేసిన కారులో 8 ఏళ్ల బాలుడు ఊపిరి ఆడకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. యూపీలోని మధుర జిల్లాలో బారారి ప్రాంతంలో 8 ఏళ్ల బాలుడు తండ్రికి టీ ఇవ్వడానికి వెళ్లాడని బాధితుడి మామ గిరీష్ అగర్వాల్ వెల్లడించారు. 
 
అయితే..తిరిగి ఎంతకు తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి…బాలుడిని వెతకాలని ఓ వ్యక్తికి చెప్పాడని వెల్లడించారు. సమీపంలో పార్కు చేసిన కారులో బాలుడు అపస్మారక స్థితిలో ఉండడం చూసి షాక్‌కు గురయ్యామన్నారు. ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా… చనిపోయాడని వైద్యులు వెల్లడించారని తెలిపారు. కారులో బాలుడు వీడియో గేమ్ ఆడుతున్నట్లు తెలుస్తోంది. మృతి చెందిన బాలుడు కృష్ణుడిగా గుర్తించారు. 
 
కృష్ణుడు తండ్రికి ఐదుగురు సంతానం కాగా.. ఇతను ఏకైక కుమారుడు. మరణానికి ముందు రెండు సెల్ఫీలు తీసుకున్నట్లు, అందులో అతను చాలా చెమటతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇంకా తమకు ఫిర్యాదు ఏమీ అందలేదని పోలీసులు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిటైల్‌ రంగంలోకి గూగుల్- మొబైల్స్‌, ఇయర్‌ఫోన్స్‌, ఎలక్ట్రాన్‌ సేల్స్ ప్రారంభం