Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వేర్పాటువాదిని జీపుకు ముందు కట్టేశారు.. జవాన్లపై పనాగ్ ఫైర్.. గాడిదలు తంతే తిరిగి తంతారా?

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచే సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ హెచ్ఎస్ పనాగ్‌కు మద్దతు ప్రకటించారు. ఆర్మీ జవాన్లను ఉద్దేశించి పనాగ్ చేసిన

Advertiesment
Markandey Katju
, సోమవారం, 17 ఏప్రియల్ 2017 (12:55 IST)
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచే సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ హెచ్ఎస్ పనాగ్‌కు మద్దతు ప్రకటించారు. ఆర్మీ జవాన్లను ఉద్దేశించి పనాగ్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ సింగర్ అభిజిత్.. పనాగ్ ఓ పాకిస్థాన్ మద్దతుదారుడంటూ విమర్శలు గుప్పించారు. కానీ కట్జూ మాత్రం ఎవరి మాటలు పనాగ్ పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. గాడిద మిమ్మల్ని తంతే దాన్ని తిరిగి తంతారా? అంటూ ఎద్దేవా చేశారు.  
 
కాశ్మీర్ వీధుల్లో భారత జవాన్లపై వేర్పాటువాదులు రాళ్లు రువ్వుతున్న నేపథ్యంలో జవాన్లకు వేర్పాటు వాదుల్ని కట్టడి చేయడం కష్టంగా మారింది. జవాన్లు ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో.. పోలీసులు వేర్పాటువాదులకు ఊహించని షాక్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్లో హల్ చల్ చేయడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
ఈ వీడియోలో రాళ్లదాడి నుంచి తమను రక్షించుకోవడానికి జవాన్లు రాళ్లు రువ్విన వ్యక్తిని జీపుకు ముందుభాగంలో కట్టినట్లు కనిపిస్తోంది. తద్వారా వేర్పాటువాదులు తమపై దాడి చేయరనేది జవాన్ల ప్లాన్. దీనిపై సీరియస్ అయిన రిటైర్ట్ లెఫ్టినెంట్ జనరల్ హెచ్ఎస్ పనాగ్.. భారత ఆర్మీ చరిత్రలో ఇదో మాయని మచ్చగా నిలిచిపోతుందని విమర్శలు గుప్పించారు. కానీ పనాగ్ పాకిస్థాన్ మద్దతుదారుడంటూ విమర్శలొచ్చాయి. 
 
ఈ నేపథ్యంలో కట్జూ ఆయనకు మద్దతుగా నిలిచారు. జవాన్లు ఈ విధంగా వేర్పాటువాదుల పట్ల వ్యవహరిస్తే వారిని మరింత రెచ్చగొట్టినట్లు అవుతుందని పనాగ్ వ్యాఖ్యానించారు. అయితే ఆయనపై పాక్ మద్దతుదారుడంటూ విమర్శలు రావడంపై కట్జూ ఫైర్ అయ్యారు. ఇంకా విమర్శలు చేసిన వారిని పరోక్షంగా గాడిదలంటూ విమర్శించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెప్పుతో తలపై కొట్టుకున్న వైకాపా ఎమ్మెల్యే.. ఎందుకో తెలుసా?