Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెప్పుతో తలపై కొట్టుకున్న వైకాపా ఎమ్మెల్యే.. ఎందుకో తెలుసా?

కడప జిల్లాలో వైకాపా ఎమ్మెల్యే ఒకరు తన చెప్పుతో తలపై కొట్టుకున్నారు. దీనికి కారణం ఏంటో తెలుసా... జిల్లాలోని ప్రభుత్వ అధికారులు, పోలీసులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తొత్తులుగా మారిపోయారని పేర్కొంటూ

చెప్పుతో తలపై కొట్టుకున్న వైకాపా ఎమ్మెల్యే.. ఎందుకో తెలుసా?
, సోమవారం, 17 ఏప్రియల్ 2017 (12:52 IST)
కడప జిల్లాలో వైకాపా ఎమ్మెల్యే ఒకరు తన చెప్పుతో తలపై కొట్టుకున్నారు. దీనికి కారణం ఏంటో తెలుసా... జిల్లాలోని ప్రభుత్వ అధికారులు, పోలీసులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తొత్తులుగా మారిపోయారని పేర్కొంటూ ఆయన పనికి పాల్పడ్డారు. ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్‌ ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే, ఛైర్మన్ ఎన్నిక జరుగకుండా వాయిదా పడింది. 
 
దీనిపై ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి మున్సిపల్‌ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ 26 మంది కోరం కౌన్సిలర్లు ఎన్నికకు సిద్ధపడగా 14 మంది టీడీపీ కౌన్సిలర్లు వాయిదా వేయమని, విధ్వంసం సృష్టిస్తే ఏకపక్షంగా వాయిదా వేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. 
 
చంద్రబాబు నీచ రాజకీయాలను అరాచక పాలనకు నిరసనగా తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వీరి దౌర్జన్య రాజకీయాలను ప్రజల్లో ఎండగడతామన్నారు. అంతకుముందు ఆర్డీవో వినాయకం, పోలీసులు సిగ్గులేనితనానికి నిరసనగా ఎమ్మెల్యే మనస్థాపం చెంది తన చెప్పు తీసుకుని తానే తలమీద కొట్టుకున్నాడు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తి కాబట్టి ఆర్డీవోపై దాడిచేయకుండా వదిలేశామని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూనియర్ ఎన్టీఆర్ సొంత పార్టీ... పేరు నవభారత్ నేషనల్ పార్టీ...