కేరళ వరదలు.. పిల్లాడి నెత్తుకుని పరుగులు.. నెట్టింట హీరోకు ప్రశంసలు

కేరళ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 37 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని ఇడుక్కి, వయనాడ్, కోజికోడ్, అలప్పుజా, ఎర్నాకులం, త్రిసూర్ జిల్లాల్లో పరిస్ధితి దారుణంగా ఉంది. ఊళ్లకి ఊళ్లు నీట

ఆదివారం, 12 ఆగస్టు 2018 (14:58 IST)
కేరళ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 37 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని  ఇడుక్కి, వయనాడ్, కోజికోడ్, అలప్పుజా, ఎర్నాకులం, త్రిసూర్ జిల్లాల్లో పరిస్ధితి దారుణంగా ఉంది. ఊళ్లకి ఊళ్లు నీటిలో మునిగిపోయాయి. వేల సంఖ్యలో ఇళ్లు నీళ్లల్లో మునిగిపోవడంతో వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. 
 
వరదల్లో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఆర్మీ అధికారులు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇడుక్కి నదిలో నీరు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో బ్రిడ్జ్ దాటలేక అమాయకంగా ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ ఉన్న చోటే నిల్చుండిపోయాడు ఓ పిల్లవాడు. 
 
దీన్ని గమనించిన ఎన్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ కన్హయ కుమార్.. చేతిలో చిన్నపిల్లవాడిని పట్టుకొని బ్రిడ్జ్‌పై నుంచి పరుగెత్తాడు. కన్హయ బ్రిడ్జ్ దాటిన క్షణంలోనే ఒక్కసారిగా బ్రిడ్జ్ కుప్పకూలింది. ఒక్క క్షణం ఏ మాత్రం ఆలస్యమైనా ఇద్దరూ ప్రాణాలు కోల్పోయేవారని, ప్రాణాలకు తెగించి మరీ పిల్లవాడిని కాపాడిన కన్హయ కుమార్‌ని అందరూ అభినందిస్తున్నారు. కన్హయ కుమార్‌ సాహసానికి నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం జగన్‌కు ముద్రగడ సవాల్.. జనసేన పార్టీ పల్లకీనే మోస్తారా?