కట్టుకున్న భార్య కేన్సర్‌తో చనిపోయింది.. భర్త కూడా ముగ్గురు పిల్లలకు విషమిచ్చి?

కట్టుకున్న భార్య అనారోగ్యంతో మృతి చెందడంతో.. ఓ భర్త కలత చెందాడు. భార్య మృతిని తట్టుకోలేని ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి తాను ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన యుపిలోని ఆగ్రా నగరంలో సంచలనంగా మార

శనివారం, 11 ఆగస్టు 2018 (12:37 IST)
కట్టుకున్న భార్య అనారోగ్యంతో మృతి చెందడంతో.. ఓ భర్త కలత చెందాడు. భార్య మృతిని తట్టుకోలేని ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి తాను ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన యుపిలోని ఆగ్రా నగరంలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే… ఆగ్రా నగర శివార్లలోని ఖైర్హే గ్రామానికి చెందిన మానసింగ్, రీనాదేవీ దంపతులకు ముగ్గురు పిల్లలు. 
 
అయితే, భార్య రీనాదేవి రెండు వారాల క్రితం కేన్సర్ వ్యాధితో చనిపోయింది. అప్పటి నుంచి భర్త మాన్ సింగ్ తీవ్ర మనస్తాపంతో ఉన్నాడు. ఈ క్రమంలో భార్య మరణాన్ని జీర్ణించుకోలేని భర్త మాన్ సింగ్ ఆవేదనతో తన ముగ్గురు పిల్లలకు విషం కలిపిన భోజనం తినిపించి తాను బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
ఆ భోజనం తిన్న ముగ్గురు పిల్లలో రచన(11) తండ్రితో పాటు మరణించగా, రూపేష్ (13), అభయ్ (9)లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనతో ఖైర్హే గ్రామంలో విషాదం నెలకొంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం జగన్ సతీమణి భారతిపై సీబీఐ కూడా కేసు నమోదు చేయాలి: వర్ల రామయ్య