Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్యను కాల్చి చంపేసిన భర్తకు జీవితఖైదు: సాక్ష్యం చెప్పిన కుమార్తె.. పనివాళ్లను కూడా వదిలిపెట్టలేదట..

భార్యను కాల్పులు జరిపి అత్యంత దారుణంగా హతమార్చిన భర్తకు జీవిత ఖైదు విధించింది. ఢిల్లీలోని కీర్తినగర్‌కు చెందిన ఫర్నిచర్ వ్యాపారి దీపక్ ఖుల్లార్ (57) తన భార్య అల్కాపై (50) తొమ్మిది రౌండ్లు కాల్పులు జరి

Advertiesment
భార్యను కాల్చి చంపేసిన భర్తకు జీవితఖైదు: సాక్ష్యం చెప్పిన కుమార్తె.. పనివాళ్లను కూడా వదిలిపెట్టలేదట..
, గురువారం, 5 జనవరి 2017 (12:43 IST)
భార్యను కాల్పులు జరిపి అత్యంత దారుణంగా హతమార్చిన భర్తకు జీవిత ఖైదు విధించింది. ఢిల్లీలోని కీర్తినగర్‌కు చెందిన ఫర్నిచర్ వ్యాపారి దీపక్ ఖుల్లార్ (57) తన భార్య అల్కాపై (50) తొమ్మిది రౌండ్లు కాల్పులు జరిపి దారుణంగా హతమార్చాడు. 2014 అక్టోబరులో జరిగిన ఈ ఘటనపై గురుగ్రామ్ జిల్లా సెషన్స్ కోర్టు నిందితుడికి జీవిత ఖైదు విధించింది. 
 
మద్యానికి అలవాటు పడిన దీపక్ ఎప్పడూ తన భార్యతో గొడవపడుతుండేవాడు. భార్యతో వాగ్వివాదం పెట్టుకొని పిస్టలుతో తొమ్మిది రౌండ్లు కాల్పులు జరిపినట్లు.. ఆతని కుమార్తె అభా పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
మొదట ఆరు రౌండ్లు కాల్పులు జరిపాక మళ్లీ బుల్లెట్లను రీ లోడ్ చేసుకొని మరో మూడు రౌండ్లు కాల్చాడని కోర్టు దర్యాప్తులో తేలింది. కాల్పుల శబ్దం విని పనివాళ్లు వచ్చి అంబులెన్సును పిలుద్దామన్నా దీపక్ వారిని అడ్డుకొని దారుణంగా చంపాడని కూతురు పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయమ్మ మృతిపై శశికళపుష్ప పిటిషన్ కొట్టివేత.. చిన్నమ్మే సీఎం కావాలంటోన్న దీపక్..