Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆకులు అలములొద్దు.. అన్నం పెట్టమంటే.. భర్తను చితక్కొట్టిన లావు భార్య

ఆహారపు అలవాట్లలో మార్పులు కారణంగా చిన్న వయస్సులోనే ఒబిసిటీ ఆవహిస్తోంది. పెళ్లికి ముందే మహిళలు, పురుషులు లావైపోతున్నారు. ఆపై డైట్‌ల పేరిట ఏవేవో తింటుంటారు. ఇలా డైటింగ్ చేస్తున్నా బరువు తగ్గలేదని బాధపడు

ఆకులు అలములొద్దు.. అన్నం పెట్టమంటే.. భర్తను చితక్కొట్టిన లావు భార్య
, మంగళవారం, 5 డిశెంబరు 2017 (14:44 IST)
ఆహారపు అలవాట్లలో మార్పులు కారణంగా చిన్న వయస్సులోనే ఒబిసిటీ ఆవహిస్తోంది. పెళ్లికి ముందే మహిళలు, పురుషులు లావైపోతున్నారు. ఆపై డైట్‌ల పేరిట ఏవేవో తింటుంటారు. ఇలా డైటింగ్ చేస్తున్నా బరువు తగ్గలేదని బాధపడుతుంటారు. ఇవన్నీ ఇక్కడ ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. లావుగా వున్న భార్య పోరు తాళలేక ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి పెళ్లైన మాసంలోనే విడాకుకులు తీసుకున్నాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. బెంగళూరులో ఐటీ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వ్యక్తికి ఏపీకి చెందిన యువతితో వివాహమైంది. పెళ్లికి ముందే అమ్మాయి లావుగా వుందని టెక్కీ ఆమెను నిరాకరించాడు. కానీ అతను తల్లి అతనికి నచ్చజెప్పి నెల రోజుల క్రితం వివాహం జరిపించింది. పెళ్లైన తర్వాత కొత్త పెళ్లి కూతురు సైజ్ జీరోకి రావాలని నిర్ణయించుకుని డైట్ పాటించింది. దీంతో కేవలం ఆకు కూరలు, పచ్చి కూరగాయలు మాత్రమే ఆహారంగా తీసుకుంటోంది. తాను తినడమే కాకుండా, తన భర్త, అత్తలకు కూడా అవే పెట్టడం చేసేది. 
 
తమకు ఆకులు అలములు వద్దని, వేరే ఆహారం తయారు చేసివ్వమని చెప్పిన అత్త, భర్తపై దాడి చేసేది. ఇలా అత్తమ్మ చేయిని విరగ్గొట్టేసింది. అంతేగాకుండా వేరుగా కాపురం పెట్టాలని వేధించేదని.. ఆమె వేధింపులు తాళలేక కోర్టును ఆశ్రయించిన టెక్కీకి బెంగళూరు కోర్టు విడాకులు మంజూరు చేసింది. టెక్కీతో వివాహం తనకు కూడా ఇష్టం లేదని లావుగా వున్న కొత్త పెళ్లి కూతురు చెప్పడంతో.. కోర్టు ఇక వారికి విడాకులు మంజూరు చేసింది. కానీ వాస్తవానికి ఇలాంటి కేసుల్లో ఆరు నెలల కౌన్సిలింగ్, పరిశీలన వంటివి వుంటాయి. ఇక వారిద్దరూ కలిసేది లేదని తేలిన తరువాత వారికి విడాకులు మంజూరు చేస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాపులకు రిజర్వేషన్లు రావడం సాధ్యం కాదా.. ఎందుకు?