Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పర్సు దొంగతనం చేసిన ప్రయాణికుడు... పట్టుకుని రైలుకు వేలాడదీశారు...

pickpocket

వరుణ్

, గురువారం, 18 జనవరి 2024 (10:11 IST)
ఓ ప్రయాణికుడు వద్ద జేబుదొంగ పర్సును దొంగిలించాడు. దీన్ని గమనించిన ఇతర ప్రయాణికులు ఆ దొంగను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత రైలుకు వేలాడదీసి, తనదైనశైలిలో బుద్ధి చెప్పారు. దొంగ రెండు చేతులు పట్టుకొని కొన్ని మీటర్ల దూరం వరకు కదులుతున్న రైలు కిటికీకి వేలాడదీశారు. 
 
ఈ క్రమంలో రైలు ట్రాక్‌ మారుతున్న సమయంలో అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు దొంగను కిందకు దింపి పక్కకు తీసుకెళ్లారు. బిహార్‌లోని భాగల్‌పుర్‌ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాన్ని రైలులో ప్రయాణిస్తున్న కొందరు తమ ఫోన్లలో బంధించారు. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మేనల్లుడి నిశ్చితార్థం కోసం హైదరాబాద్ వెళుతున్న సీఎం జగన్